ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తుంది... ప్రస్తుతం అందరూ డైరెక్ట్ మీటింగ్లకు అంటే చాటింగ్ లకే  ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీంతో ఆన్లైన్ చాటింగ్ యాప్స్  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నాయి . అయితే ప్రస్తుతం ఆన్లైన్  చాటింగ్ యాప్స్  లో ప్రస్తుతం ఎక్కువమంది యూసర్ యూస్ చేస్తున్నా యాప్  ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వాట్స్అప్. ఎక్కువ మంది డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కంటే వాట్సాప్లో మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నారు...డైరెక్టుగా కలవటం  అంటే వీడియో కాల్ లో చూసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్  చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కు  రోజురోజుకు యూజర్ల సంఖ్య పెరిగిపోతుంది. 



 అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్  లేని మనిషి లేడు అనేది  ఎంత నిజమో స వాట్సాప్ లేని స్మార్టు ఫోన్ లేదు  అన్నది కూడా అంతే నిజం. ప్రస్తుతం వాట్స్అప్ యుగం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు . ప్రస్తుతం ఎవరితో ఏం మాట్లాడాలన్నా అది ఒక వాట్సాప్ లోనే మాట్లాడుతున్నారు.  పక్కన ఎంత మంది మనుషులున్న  వాట్సాప్ లో చాటింగ్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ప్రజలు. ఈ నేపథ్యంలో అటు వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ప్రవేశపెట్టింది వాట్సాప్. 



 ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది.  ఎంతో కాలంగా వాట్సాప్ వినియోగదారులు అందరూ ఎదురుచూస్తున్న ఫింగర్ ప్రింట్  ఆన్లాక్ వచ్చేసింది. కొన్ని నెలలుగా బీటా సెట్టింగ్ చేసిన తర్వాత మొత్తానికి ప్రస్తుతం యూజర్లకు ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్  రిలీజ్ చేసింది వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ యూజర్స్  ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ ఇన్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని వాట్స్అప్ తెలిపింది. ఇక  మీ వాట్సప్ చాట్స్ కు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఇప్పటినుంచి లభించనుంది. ఎన్ని రోజుల వరకు వాట్స్అప్ లాక్ చేయాలంటే  చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ని  ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం వాట్సాప్ ప్రత్యేకంగా ఫింగర్ ప్రింట్ లాక్ ఫ్యూచర్ ని వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది.



ఇప్పటికే చాలా యాప్స్  తన వినియోగదారులను ఆకర్షించడానికి ఫింగర్ ప్రింట్స్ ఫీచర్  ని తీసుకురాగా...  ప్రస్తుతం  వాట్సాప్ లోకి కూడా ఈ ఫీచర్ దూరిపోయింది. ఐఫోన్ లకు  టచ్ ఐడి తో  పాటు పేస్ ఐడి అతేంటికేషన్  కూడా రిలీజ్ చేసిన వాట్సాప్... ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం కేవలం ఫింగర్ప్రింట్ అన్ లాక్ ఫీచర్ మాత్రమే తీసుకు వచ్చింది. మరి మీరు వాట్సాప్ ఫింగర్ ప్రింట్  ఫిచర్ ని మీ మొబైల్ లో వాడాలనుకుంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్స్అప్ ఆప్ ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ ఇన్ స్టాల్  అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ సెట్టింగ్స్ లో అకౌంట్ సెక్షన్ లో ఫింగర్ ప్రింట్ లాక్ పీచ్ ఆన్ చేయాలి. క్లిక్ చేయగానే ఫింగర్ ప్రింట్ అతేంటికేషన్ క్లోజ్  కావాలా లేక కొంత సమయం తర్వాత క్లోజ్  కావాలా అని కూడా సెట్టింగ్స్ మార్చు కోవచ్చు. కాగా  వాట్సాప్ లో వివిధ డిసైన్ లలో కూడా ఉపయోగించడానికి ఇంకొన్ని రోజుల్లో  సరికొత్త ఫీచర్లతో రాబోతుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: