ఆర్టీసీ డ్రైవర్ రాజు చనిపోయి మూడు రోజులు అవుతూ ఉండటంతో రాజు కుటుంబ సభ్యులు అంతియ యాత్రకు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రీజర్లో సమస్యలు ఏర్పడటంతో ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు బాబు కుటుంబసభ్యులతో చర్చించి అంతిమ యాత్రను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్ బాబు కుమారుడి చివరి కోరిక మేరకు డ్రైవర్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ బస్ డిపో 2 వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తున్నారు. 
 
కార్మికులు అంతిమయాత్రలో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. కరీంనగర్ నగర్ ఎంపీ బండి సంజయ్ అంతిమయాత్రను పోలీసులు అడ్డుకోవాలని చూస్తే లాఠీ ఐనా తూఠా ఐనా తనపైనే పడాలని చెప్పారు. ప్రశాంతంగా అంతిమ యాత్రను నిర్వహిస్తామని డ్రైవర్ బాబు ఆశయాల్ని సాధిస్తామని అన్నారు. మృతదేహాన్ని బస్ డిపో దగ్గరకు తీసుకొనివెళ్తామని బండి సంజయ్ అన్నారు. సమ్మెకు పరిష్కారం కరీంనగర్ గడ్డమీదే దొరుకుతుందని బండి సంజయ్ అన్నారు. 
 
కొందరు నేతలు ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని డిమాండ్ చేశారు. పోలీసులు అంతిమయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులలోను ర్యాలీకి అనుమతించే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరు అనుమతించినా అనుమతించకపోయినా డ్రైవర్ బాబు మృతదేహంలో బయలుదేరుతానని దమ్ముంటే అరెస్ట్ చేసుకోండని బండి సంజయ్ అన్నారు. 
 
కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఅర్ నియంత అని కేసీఆర్ కు జ్ఞానం లేదని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కారణంగా 50 వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికులు చనిపొతుంటే కనికరం లేదా..? అని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. సీఎం కేసీఆర్ కు అంత అహం పనికిరాదని పట్టువిడుపు ఉండాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా గత 28 రోజుల నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: