భారతీయ తపాలా శాఖ ఇప్పటికే వివిధ సర్వీసులు  రైల్వే, తిరుపతి దేవస్థానం మరియు బ్యాంకింగ్  సర్వీస్లను ఇప్పటికే పాలుపంచుకోవడమే కాకా ఎప్పుడు ఆధార్ కార్డు సర్దిదిద్దుకునే వెసలుబాటు కల్పిస్తూ కొన్నినెలల క్రితమే అన్ని తపాల శాఖలకు  ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు   మరో సరికొత్త సేవలతో ముందుకొస్తోంది. ఇకపై ఆధార్ సేవలు అనగా ఆధార్ కార్డు నమోదు, సరిచేసుకునే సేవను మన ఇంటికే వచ్చి చేస్తారు.

  హైదరాబాద్‌లో ఇప్పటికే వివిధ శాఖలో ఏర్పాటు చేసిన  ఆధార్ కేంద్రాలను తపాలా శాఖ ఇప్పుడు నేరుగా ఇంటి వద్దేకె వచ్చి వారి  సేవలు అందించాలని నిర్ణయించింది. దీనికి మనం చేయాల్సిందల్లా తపాలా కార్యాలయం లో నమోదు చేసుకుంటే మీకిచ్చిన సమయానికి మీ ఏంటికి వచ్చి సేవలు అందిస్తారు. ఇప్పటికే ఆధార్ నమోదు కార్యక్రమం సక్రమంగా లేక చాల కార్డులలో పేరు, పుట్టిన తేదీ, ఊరు పేరులు తప్పులుగా నమోదు చేసుకోవడం వాళ్ళ ప్రజలు మల్లి వాటిని సరిదిద్దుకునేందుకు ప్రస్తుతం ప్రజలు ఆధార్ నమోదు కేంద్రాల దగ్గర క్యూలు కడుతు చాల ఇబ్బందులు పడుతున్నారన్న  ఆలోచనతో ఈ చక్కటి సేవను తపాలా ద్వారా  ఆధార్ సేవను మన ఇంటికే అందిస్తున్నారు .

ఈసేవకు గాను తపాలా శాఖ  యూఐడీఏఐతో రెండున్నరేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుని  తపాలా శాఖ  ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. గత కొన్ని నెలలుగా తపాలా శాఖ  కేవలం ఆధార్ సరిచేసుకోవడనికే  పరిమితమైన తపాలా శాఖ  ఎప్పటి నుండి కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు కొనసాగిస్తోంది.

కొత్తగా ఆధార్‌ కార్డు నమోదును ఉచితంగా చేస్తుండగా కార్డు సరిచేసుకోవడనికి యాభై రూపాయలు రుసుము కట్టి సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా  ఈ సేవలను అవసరమైన వారి ఇంటికె  వచ్చి సేవలను అందించాలని తపాలా శాఖ నిర్ణయించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: