ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నగరంలో పడే వర్షాల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంటే.. పల్లెల్లో పడే భారీ వర్షాల కారణంగా పంటపొలాలు నాశనం అవుతున్నాయి. అయితే ఇప్పుడు పడుతున్న వర్షాలు చాలదు అని ఇప్పుడు రానున్న 48 గంటల్లో ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. 

             

ఈ అల్పపీడనం మరింత బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 5, 6 తేదీల్లో వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాలపై ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. కాగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

          

అరేబియా మహాసముద్రంలో ప్రస్తుతం రెండు తుఫాన్లు కొనసాగుతుండగా, 'క్యార్‌' బలహీనపడి తుఫాన్‌గా మారింది. అయితే ఇది మరింత బలిహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ తుఫాన్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో, తెలంగాణాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాతావరణ శాఖ హైఅలెర్ట్ ప్రకటించింది. 

              

ఏది ఏమైనా ఈసారి పడిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వర్షాలు ఒక సంవత్సరం అతివృష్టిగా కురిస్తే.. మరో సంవత్సరం అనావృష్టి అన్నట్టు ఉంటాయి. వర్షాలు లేక పొలాలు నాశనం అవుతే ఇప్పుడు అతిగా వర్షాలు పడి పంటలు నాశనం అవుతున్నాయి. వర్షాలు ఎలా వచ్చిన సరే.. రైతులకు కష్టాలు తప్పడం లేదు. 

         

మరింత సమాచారం తెలుసుకోండి: