టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలో, కెరీర్ పరంగా అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో ఎంతో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం, తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్, ఆ సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ సినిమాలో మెగాస్టార్ అత్యద్భుత నటనకు గాను ప్రేక్షకులు నీరాజనాలు పట్టడం జరిగింది. ఇకపోతే రెండేళ్ల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో నటుడిగా మళ్ళి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్

సినిమా సూపర్ సక్సెస్ తో హీరోగా తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. అయితే నేడు కొన్ని సినీ, రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఇకపై రాబోయే రోజుల్లో మెగాస్టార్ రాజకీయాల్లో కనపడే అవకాశం చాలావరకు లేదనే వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. నిజానికి 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పే సమయంలోనే అమితాబ్ బచ్చన్ వంటి కొందరు నటులు తనను రాజకీయాల్లోకి వెళ్లోద్దని వారించారని, ఇటీవల సైరా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా చేసిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన రాజకీయాలపై కొంత నిరాశక్తిగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. 

ఇక కొద్దిరోజుల క్రితం నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న మెగాస్టార్, ఆ పార్టీకి సంబందించిన ఎటువంటి రాజకీయ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవల కొందరు ఆ పార్టీ పెద్దలు తనను కలిసినప్పటికీ కూడా, ఆయన మాత్రం పెద్దగా స్పందించలేదని టాక్. ఇక దీనిప్రకారం రాబోయే రోజుల్లో ఆయన రాజకీయాలని పూర్తిగా వదిలి సినిమాల్లోనే కొనసాగుతారని అంటున్నారు. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: