ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కరువై అవస్థలు పడుతున్నారు. కాగా  రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇసుక కొరత సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో విపక్షాలన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్  కి పిలుపునిచ్చారు. దీని కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు . ఈ క్రమంలోనే టిడిపి కూడా లాంగ్ మార్చ్ కు మద్దతు తెలిపింది. అయితే తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోయినట్లు ఉన్న కలిసే నడిపిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. 



 చంద్రబాబు చెప్పింది పవన్ కళ్యాణ్  చేస్తారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. అయితే వాస్తవానికి టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడిపోలేదని కేవలం ప్రజలను నమ్మించడానికి మాత్రమే విడిపోయినట్టు నటిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య పై   చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపడితే... చంద్రబాబు రాజకీయ దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇసుక కొరత పై కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.



 ఈ సందర్భంగా సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ కొట్టివేతకు గురికావటం పై స్పందించిన  ఎమ్మెల్యే అంబటి రాంబాబు... పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద కేసులు ఉన్నప్పుడే ప్రజలు ఎన్నికల్లో ఆయనను  భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనపై కేసులు ఉన్న సమయంలోనే పాదయాత్రకు కూడా వెళ్లారని... ఎన్నికల్లో కూడా పోటీ చేశారని... ప్రజలు ఆయనను ఆశీర్వదించారని... ప్రతిపక్షాల కొత్తగా రాద్ధాంతం చేయొద్దని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ లాంటి గొప్ప వ్యక్తి సాక్షులను ప్రభావితం చేస్తారనడం సరికాదన్న అంబటి రాంబాబు... అయినప్పటికీ కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: