అక్రమ ఆస్తుల వ్యవహారంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 


ఐతే, జగన్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై కన్నా మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేననే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. జగన్ ని 5 నెలలు భరించలేని ఆంధ్రులు...   మరో నాలుగున్నరేళ్లు ఎలా ఉండాలో అని భయాందోళన చెందుతున్నారని అన్నారు కన్నా.  ‘‘మా పార్టీ వారిని కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం అని కన్నా అన్నారు. 


 జగన్‌పై నమోదైన కేసు వ్యక్తిగత హోదాలోనే కదా? అయినా ప్రజల సమస్యలు తీర్చకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ‌ వేడుకలు ఎందుకని ప్రశ్నించారు. మాకైతే అవతరణ వేడుకలకు ఎటువంటి ఆహ్వానం అందలేదు’’ అని తెలిపారుకన్నా లక్ష్మీనారాయణ .
  చేతనైతే సమస్యను పరిష్కరించాలే కానీ.. సమస్యపై పోరాటం చేస్తున్న వారిపై వ్యక్తిగత దాడులు సరికాదని హితవు పలికారు.  ఏపీలో ప్రభుత్వమే ఇసుక కృత్రిమ కొరతను సృష్టించిలక్షలాది మంది కార్మికుల కష్టాలకు కారణమైందని అన్నారు. 

ప్రతిపక్షాలకు సమస్యగా కనిపించినా.. పదవుల్లో ఉన్న మంత్రులకు మాత్రం కనిపించడంలేదన్నారు.  రాష్ట్రంలో ఇసుక కొరత లేదని సీఎం ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. తక్షణమే ఇసుక కొరతను నివారించాలని.... ఒక్కో కార్మికునికి 10వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్‌లో పాల్గొనడం లేదని.....కానీ తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. ఈ  అంశంపై ఇతర నాయకులు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఈనెల 4న మాత్రం ఇసుక సత్యాగ్రహం చేపడుతున్నట్లు ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: