కృష్ణా జిల్లా....టీడీపీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కానీ మిగతా చోట్ల ఓడిపోయిన టీడీపీ బలంగానే ఉంది.  అది ఒక్క విజయవాడ వెస్ట్ తప్ప. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పేరు వినబడే చాలా ఏళ్ళు అయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ టీడీపీ అడ్రెస్ లేదు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీలోకి వచ్చారు.


కానీ మొన్న ఎన్నికల్లో జలీల్ కుమార్తె షబానా టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో...ఇక్కడ టీడీపీ కథ మారదని అర్ధమైపోయింది. సరే ఓడిపోతే ఓడిపోయారు పార్టీని బలోపేతం చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో అయిన సత్తా చాటోచ్చు. అయితే ఆ పని మాత్రం అక్కడ టీడీపీ నేతలు చేయడం లేదు. గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయి. దీని వల్ల టీడీపీ ఇక్క బాగుపడే పరిస్తితి కనబడటం లేదు. మొన్నటికి మొన్న జిల్లా విస్తృత స్థాయి సమావేశాల్లోనే అధినేత చంద్రబాబు ముందే వీరి గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.


మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీనియర్ నేత నాగుల్ మీరా వర్గాలు బాబు ముందే బాహాబాహీకి దిగారు. ఓటమికి మీరంటే మీరు కారణమని దూషించుకున్నారు. దీంతో బాబు సీరియస్ అయ్యి క్లాస్ ఇచ్చారు. ఇక మీదట విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తన స్కానింగ్‌లోనే ఉంటుందని, మొత్తం లైన్ లో పెడతానని చెప్పారు. అయితే ఎన్ని చేసిన గ్రూపు తగాదాలు తగ్గకపోతే ఇక్కడ టీడీపీ బాగుపడే ప్రసక్తే లేదు.


కీల‌క‌మైన ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ఓ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ స‌రైన క్యాండెట్‌ను కూడా నిల‌బెట్టుకోలేని దుస్థితిలో ఉండ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాలు కూడా షాక్‌లోనే ఉన్నాయి. విజ‌య‌వాడ‌లోనే ఈ ప‌రిస్థితి ఉంటే ఏపీలో పార్టీలు మారిన నేతులు ఉన్న చోట ప‌రిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: