వైఎస్ జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి వ్యూహాత్మకంగానే పాలన చేస్తున్నట్లు కనబడుతుంది. ఒకవైపు ప్రజలకు మేలు చేసే పథకాలు, నిర్ణయాలు తీసుకుంటూనే, మరోవైపు వాటి ద్వారా లబ్ది పొందిన ప్రజల మద్ధతు కూడా కూడబెడుతున్నారు.  ముఖ్యంగా జగన్ ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా రావాలన్న, ఏ ప్రభుత్వం అయినా పడిపోవాలన్న అది ఉద్యోగులు, యువత చేతిల్లోనే ఎక్కువ ఉంటుంది.


మొన్న ఎన్నికల్లో కూడా అత్యధిక మంది యువత, ఉద్యోగులు వైసీపీ పక్షానా నిలబడటం వల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. దీంతో వారి మద్ధతు అలాగే కొనసాగడానికి, ఇంకా ఎన్నికల్లో జనసేన, టీడీపీల వైపు ఉన్న మరికొంతమంది యువత మద్ధతు కూడబెట్టడానికి జగన్ అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఐదు నెలల కాలంలోనే యువతకు, ఉద్యోగులకు జగన్ పెద్ద పీఠ వేశారు.


ముఖ్యంగా యువత కోసం లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాల పేరిట ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచారు. అలాగే మద్యం షాపుల్లో కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. ఇక తాజాగా మిగిలిపోయిన వాలంటీర్ల పోస్టులని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టారు. త్వరలోనే 11,500 పైగా ఉన్న పోలీసుల ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. జనవరిలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అటు ఉద్యోగులకు కూడా జగన్ అండగా నిలబడ్డారు.


ఆశా, అంగన్వాడీ, హోమ్ గార్డులు, పారిశుధ్య కార్మికులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌ల జీతాలు పెంచారు. ఇక తాజాగా 108, 104 లలో పని చేస్తున్న వారి జీతాలు రెట్టింపు చేశారు. ఈ విధంగా జగన్ యువత, ఉద్యోగుల పై ఐదు నెలల్లో వరాల జల్లు కురిపించారు. దీని వల్ల వచ్చే ఎన్నికల నాటికి వీరి మద్ధతు మరింత రెట్టింపు అవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: