రాష్ట్రంలో టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. అయి తే, అలాంటి చోట కూడా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. అయితే, కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రంలో మాత్రం కొన్ని ద‌శాబ్దాలుగా వ‌స్తున్న ఆన‌వాయితీని మాత్రం నిల‌బెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ వ‌రుస‌గా క‌మ్మ వ‌ర్గానికి చెందిన వ‌ల్ల‌భ‌నేని వంశీ విజయం సాధించారు. ఆయ‌న రెండోసారి విజ‌యం సాధించి క‌నీసం ఆరు మాసాలు కూడా గ‌డ‌వ‌క ముందుగానే త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని, ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని పేర్కొంటూ.. పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు.


ఈ నేప‌థ్యంలో వంశీ చేసిన రాజీనామా ఆమోదం పొందితే.. ఖ‌చ్చితంగా ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం ఖా యం. ఈ క్ర‌మంలో గ‌న్న‌వ‌రంలో ఎవ‌రు జెండా ఎగ‌రేసే అవ‌కాశం ఉంది? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 1983 నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. 1985, 1994, 1999, 2004, 2009, 2014, 2019ల‌లో మాత్ర‌మే ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌ధ్య‌లో ఎప్పుడూ కూడా ఉప ఎన్నిక‌ల అవ‌స‌రం ఈ నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


దీంతో ఇప్పుడు తొలిసారి చోటు చేసుకుంటుంద‌ని భావిస్తున్న ఉప ఎన్నిక‌పై చాలా ఆస‌క్తి నెల‌కొంది.వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా ఉంది. దీంతో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన నాయ‌కులు కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. వారే ఇక్క‌డ విజ‌యం కూడా సాథిస్తూ.. వ‌స్తున్నారు. అదేస‌మ‌యంలో ఈ వ‌ర్గం కూడా టీడీపీకి చెందిన నాయ‌కులే ఎక్కువ‌గా ఉండడం గ‌మ‌నార్హం. అయితే, పార్టీ బ‌లంతో పాటు గ‌తంలో గ‌ద్దె రామ్మోహ‌న్ వంటి వ్య‌క్తుల ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా నే ఉంది.


ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వంశీ త‌న వ్య‌క్తిగ‌త మాస్ ఇమేజ్‌తోనే ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కార‌న‌డంలో సందేహం లేదు. జ‌గ‌న్ సునామీ ధాటిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వంశీ గెలిచారు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ జ‌ర‌గ‌బోయే ఉప‌ ఎన్నిక‌లో టీడీపీ విజ‌యం సాధించేందుకు ఎలాంటి ఎత్తుగ‌డ వేస్తుంది?  పార్టీని బ‌లోపేతం చేస్తుందా? వ‌్య‌క్తుల బ‌లాన్ని న‌మ్ముకుంటుందా?  అనేది ఆస‌క్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: