ఒక పక్క తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉదృతం అవుతుంటే మరో పక్క కేసిఆర్ మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నాడు. కేసిఆర్ ఒక నియంతలా తాను ఏమి చెబితే అదే వినాలని... తన మాటే చివరి మాట అన్నట్టు ప్రవర్తిస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. అప్పట్లో తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తానంటూ కార్మికుల సాయం తీసుకొని ప్రత్యేక తెలంగాణ సాధించి సీఎం పీటం ఎక్కిన కేసీఆర్ ఇప్పుడు అదే కార్మికులు అధోగతి పాలవుతున్నా పట్టించుకోని పరిస్థితి ఎదురయింది అని పలువురి అభిప్రాయం.

ఈరోజుకి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 28 రోజులకు చేరుతుంది. ఇన్ని రోజులు వారు పడుతున్న కష్టాలు కెసిఆర్ కు అసలు కనిపించట్లేదని... కొన్ని వేల కుటుంబాల కష్టాలు కానరావడం లేదని అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతానికి ఏవో కొన్ని బస్సులను నడుపుతున్నా అవి ఏమాత్రం సరిపోవట్లేదు. ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని హైకోర్టు మందలించినప్పటికీ కెసిఆర్ దానిని పెడచెవిన పెట్టాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా చేసుకున్నాడే తప్ప ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ఉద్దేశం ఆయనకు లేనట్టుంది.

ఇక పోతే రేపు దీనంతటికీ కేసీఆర్ తెరదించబోతున్నాడని సమాచారం. రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ పై కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన దాని ప్రకారం ఆర్టీసీలో 50శాతం యాజమాన్య బస్సులు - 30శాతం అద్దె బస్సులు - 20శాతం ప్రైవేటు స్టేజి క్యారియర్లు ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
అప్పుడెప్పుడో తాను ఒక సంతకం పెడితే వందలాది ప్రైవేటు బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ వాళ్లను బెదిరించిన కేసీఆర్ ఇప్పుడు అదే నిజం చేస్తాడని అనిపిస్తుంది.

ప్రైవేట్ స్టేజి క్యారియర్ లకు అనుమతిస్తే 20 శాతం ప్రైవేటీకరణ పూర్తయినట్టే. కేసిఆర్ చెప్పిన 21 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు సమ్మతించి ఉంటే అప్పుడే విలీనం చేసే వాడినేమో... ఇప్పుడు వాళ్లు అంత పట్టుదలగా సమ్మె చేస్తుంటే తాను వెనక్కి తగ్గేదిలేదని కొందరు మంత్రులతో చెప్పారట. ఇదే గనుక జరిగితే ఆర్టీసీ భూస్థాపితం అవుతుంది. రేపు చర్చల తర్వాత కెసిఆర్ నిర్ణయం ప్రైవేటీకరణ చేయడమే అయితే ఎల్లుండి నుంచి రోడ్డేక్కేది బస్సులు కాదు 48 వేల కుటుంబాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: