ఉన్నది ఒకసీటు దానికోసం జరుగుతున్న పోరు. ఆ పోరులో ఊరిస్తున్న సీయం పీఠం. అదీ ఎవరికి దక్కుతుందో తెలియని ఆందోళనలో పార్టీ కార్యకర్తలు. ఇకపోతే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడి వారంపైగా కావస్తున్నాయి. అయినాగాని  ఇంకా ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ-శివసేన పార్టీలు దోబూచులాడుతున్నాయి దేనికోసమంటారా సీఎం పదవి కోసం.. ఈ విషయంపై ఈరోజు సంజయ్ రౌత్ ఓ మిడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.


‘బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటం జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్‌ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు’ అని తెలిపారు.


ఇది ఇలా ఉండగా తాజాగా బీజేపీ నేత, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగటివార్ నవంబర్ 7లోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇకపోతే సుధీర్ మాట్లాడుతూ త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల పాటు చెరిసగం పంచుకోవాలన్న శివసేన డిమాండ్ కారణంగానే ప్రతిష్టంభన నెలకొన్నట్టు ఆయన పేర్కొన్నారు.


అయితే ఈ డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకుంటుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఈ ప్రతిష్టంభన తొలగిపోవడానికి అవసరమైతే పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏది ఏమైన ఉన్న ఒక్క ముక్క కోసం నక్కలు పొట్లాడుకున్నట్లుగా మహరాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: