ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తుపాన్ వచ్చింది. అయితే ఇది రాజకీయ ఇసుక తుపాన్.. రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. గోదావరి, కృష్ణానదులకు ఎన్నడూ రానంతగా వరదలు రావడం వల్ల ఇసుక తవ్వకాలు తగ్గాయి. అయితే ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ, జనసేన శవరాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.


ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు రావడంతో నదుల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ శవ రాజకీయాలు మొదలుపెట్టారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుడు నాగ బ్రహ్మాజీ.. ఇసుక కొరత కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి. నాగబ్రహ్మాజీ ఆత్మహత్యపై వాస్తవాలు ఒక్కసారి గమనిస్తే.. నాగ బ్రహ్మాజీకి ఇద్దరు భార్యలు ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


కుటుంబ తగాదాలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్మ చేసుకున్నట్లు సొంత తమ్ముడు పోలీస్ విచారణలో చెప్పాడట. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 5 నెలలు కావొస్తోంది. ఈ ఐదు నెలల్లో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేకపోతేనే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటాయా అని సామాన్య జనానికి కూడా అనుమానం రాకమానదని వైసీపీ నేతల చెబుతున్నారు.


బాబు సీఎం గా ఉన్న గత అయిదేల్లో 2,365 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి నారాయణ కాలేజీలలో కనీసం 50 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్కరికి రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు. బాబు హామీలకు నాది పూచి, నన్ను చూసి ఓటేయండి అని కాపు కాసి గెలిపించిన పవన్ ఇంతమంది ఆత్మ హత్యలు చేసుకొంటే ఏనాడైనా డబ్బిచ్చాడా, బాబును విమర్శించాడా ?.. అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు డ్రామా పార్టీ అధ్యక్షుడు బాబు, బిజినెస్ పార్టనర్ లు పవన్ డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విజ్ఞులైన ప్రజలు గమనించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: