ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న విధంగా కృష్ణా జిల్లా గన్నవరం ఉప ఎన్నిక వ్య‌వ‌హారం. ఈ నెల‌ 3 లేదా 4వ తేదీల్లో వంశీ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. కాకపోతే వైసీపీలోకి వెళ్ళేముందు వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. కాబట్టి రాజీనామా చేస్తే,దాన్ని స్పీకర్ ఆమోదిస్తే అక్కడ ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.


ఇక ఉప ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి వంశీయే పోటీ చేస్తారా ?  లేదా ?  అన్న‌ది క్లారిటీ లేదు. ఇక వైసీపీ సంగ‌తి ఇలా ఉంటే విప‌క్ష పార్టీలు అయిన టీడీపీ, జ‌న‌సేన నుంచి ఎక్క‌డ ఎవ‌రు పోటీ చేస్తారు ? అన్న‌ది కూడా ఆస‌క్తిగా మారింది. ఈ యేడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన కీల‌క నాయ‌కులు ఇద్ద‌రూ ఓడిపోయారు. లోకేష్ మంగ‌ళ‌గిరిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వారిద్ద‌రికి గ‌న్న‌వ‌రం ఉప ఎన్నిక ఓ అందివ‌చ్చిన అవ‌కాశంగానే భావించాలి.


టీడీపీ నుంచి జిల్లా ప‌రిష‌త్ మాజీ చైర్‌ప‌ర్స‌న్ గ‌ద్దె అనూరాధ లేదా అలాగే లోకేష్‌ను అసెంబ్లీలో కూర్చోపెట్టాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ లోకేష్‌ను కూడా పోటీ చేయించే ఆలోచ‌న‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇది క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి పెట్ట‌ని కోట‌... పైగా టీడీపీకి కంచుకోట‌. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ లోకేష్ పేరు కూడా ప‌రిశీల‌న‌కు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.


ఇక జ‌నసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప‌వ‌న్ ముందుగా పార్టీ క‌న్నా త‌న‌ రాజకీయ భవిష్యత్ కోసం పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఎవరు పోటీ చేస్తారనేది మరో చర్చ. ఇక ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో టీడీపీ - జ‌న‌సేన ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఒక‌వేళ ఈ రెండు పార్టీల పొత్తు ఉన్నా కూడా గ‌న్న‌వ‌రం టీడీపీకి కంచుకోట కాబ‌ట్టి ఆ పార్టీయే పోటీ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌. 983,85, 1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధించింది. మరి ఈ సారి ఉప ఎన్నికలోస్తే గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: