ఎల్లోమీడియా తాజా కథనంలో చంద్రబాబునాయుడుకు నైతిక విలువలు లేవన్న విషయాన్ని తేల్చేసినట్లు కనిపిస్తోంది. సిఎం @ సిబిఐ కోర్టు అనే హెడ్డింగ్ తో మొదటిపేజిలో పెద్ద కథనాన్నే అచ్చేసింది. అదే హెడ్డింగ్ కు ఉప హెడ్డింగ్ గా కోర్టు బోనులో రాష్ట్ర ప్రతిష్ట అని రాసింది. అక్రమాస్తుల విచారణలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ను సిబిఐ న్యాయస్ధానం కొట్టేసింది.

 

వ్యక్తిగత మినహాయింపు సాధ్యం కాదని మాత్రమే కోర్టు చెప్పింది. అంతేకానీ జగన్ పై ఉన్న కేసుల్లో దోషి అని ఎక్కడా చెప్పలేదు. ఇంతమాత్రానికి ఎల్లీమీడియా, టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. నైతిక బాధ్యత వహించి జగన్ వెంటనే సిఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

ఇదే విషయంలో ఎల్లోమీడియా మరో అడుగు ముందుకేసింది. ఆరోపణలు రాగానే రాజీనామా చేసిన వారు ఎవరు ?  కోర్టు తప్పుపట్టగానే రాజీనామా చేసిందెవరు ? తీర్పు వచ్చిన తర్వాత పదవికి రాజీనామా చేసిందెవరు అంటూ కొంతమంది పేర్లను ఉదహరించింది. అయితే ఈ పేర్లలో ఎక్కడ కూడా చంద్రబాబునాయుడు పేరు లేదు. నైతిక విలువలు ఉంటే జగన్ అసలు సిఎం పదవిని చేపట్టేవారే కాదని ఓ విశ్లేషకుడు ( ఆ విశ్లేషకుడు ఎవరో ?) చెప్పాడట.

 

అది నిజమే అయితే మరి ’ఓటుకునోటు’ కేసులో చంద్రబాబు చేసిందేమిటి ? అందరికీ తెలుసు ఓటుకునోటు కేసులో చంద్రబాబు పాత్రేమిటో ? ఏసిబి కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో  చంద్రబాబు పేరుందనే ప్రచారం జరిగింది. మరి అప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు ?

 

ఎందుకంటే చంద్రబాబుకు నైతిక విలువలు లేవు కాబట్టే. తన కథనంలో ఎల్లోమీడియా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఇదొకటే కేసు కాదు. తన మీద ఉన్న చాలా కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని చంద్రబాబు కంటిన్యు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ కు నైతిక విలువలు లేవని చాటి చెప్పటంలో చంద్రబాబుకు నైతిక విలువలు లేవని ఎల్లోమీడియా తేల్చేయటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: