వాస్తవంలో చాలామంది బయటకు మాట్లాడేది ఒకటి మనసులో ఉండేది మరొకటి. అటు ఇటుగా మనిషి తత్వమే ఇలా తయారైంది. కానీ సెలబ్రిటీలు, ఫేమస్ పర్సనాలిటీస్, రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు.. ఇలాంటివి చేస్తేనే హాట్ టాపిక్ గా మారతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇటువంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.

 


విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకుడిగా తన వాగ్దాటితో విరుచుకుపడుతూంటాడు. రేపు విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి పవన్ బీజేపీ అధ్యక్షుడు కన్నా మద్దతు కోరిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటే విష్ణువర్ధర్ రెడ్డే ముందుగా స్పందించి జనసేనకు మద్దతివ్వాల్సిన అవసరం బీజేకి లేదు అని మెసేజ్ చేశారు. ఈ ట్వీట్ జనసైనికులకు విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. దీంతో వాళ్లు ఊరుకుంటారా.. గతంలో ఆయన చేసిన ట్వీట్లు అని కొన్నింటిని వైరల్ చేశారు. ఈ ట్వీట్లన్నీ సినీ, రాజకీయాల్లోని ఆయన సామాజికవర్గం గురించే ఉన్నాయి. తన సామాజికవర్గం వారిని పొగుడుతూనే ప్రతి ట్వీట్ ఉంది. ఆ ట్వీట్లలో ఇతర సామాజిక వర్గాన్ని కదిపాడు. వారిని తక్కువ చేస్తూ కూడా ట్వీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్లన్నీ సోషల్ మీడియీలో వైరల్ అయిపోయాయి.

 


దీంతో విష్ణువర్ధన్ రెడ్డి బయటకు మాట్లాడే దేశభక్తి, బీజేపీ అభిమానపు మాటల మూటలన్నీ మేడిపండు.. సామెత చందాన తయారయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్లు రేవు ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్ ఎగ్జిస్ట్ లో ఉంది. అయినా కొన్ని ట్వీట్లు బయటకొచ్చాయి. దీంతో ఈ ట్వీట్లన్నీ ఆయనే చేసారా అని కామెంట్లు వస్తున్నాయి. తనవి కాని మెసేజెస్ అయితే హ్యాక్ అయినట్టు చెప్పుకోవాలి కానీ అకౌంట్ డిలీట్ చేయడమేంటని నెటిజన్లు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: