పెద్ద పెద్ద అడవులకు దగ్గరగా ఉన్న తరచు ఏనుగుల దాడులు చేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి ఇళ్లపైన పంటపొలాలు పైన దాడి చేసి చేస్తుంటాయి . ఏనుగుల దాడి చేయటంతో  ప్రజలందరూ భయాందోళనకు గురవ్వక తప్పదు. దానితో మా ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దీంతో అటవీ ప్రాంతల సమీపంలో ఉండే ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతుంటారు. అడవిలోంచి వచ్చిన ఏనుగుల గుంపు  భయంకరంగా పంట పొలాలపై గ్రామాలపై దాడిచేసి... పంటపొలాలను నష్టం చేయడమే కాకుండా కొంత మంది ప్రజలను ప్రాణాలు సైతం గాల్లో  కనిపేస్తాయి . ఈ నేపథ్యంలో తరచూ వచ్చే ఏనుగుల గుంపును  తరిమి కొట్టడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఏనుగుల  ముందు పనిచేయలేదు.  ఇలాంటి ఘటనే అసోం వాసులకు ఎదురైంది. తరచు గ్రామాల్లోకి వచ్చి ఏనుగుల గుంపు దాడి చేస్తున్న తరుణంలో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.



 ఏనుగుల గుంపు ఇటీవల తరచూ గ్రామాలకు వస్తూ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో అధికారులు ఏనుగు లను తరిమి కొడుతున్నప్పటికి మళ్లీమళ్లీ వస్తుండడంతో అటవీ అధికారులు కూడా ఏమి చేయలేక పోతున్నారు. ఇటీవల తరచూ దాడులకు పాల్పడుతున్న ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత మూడు రోజుల క్రితం గొల్పార  జిల్లాలో ఏనుగులు గుంపు  బీభత్సం సృష్టించింది. ఓ గ్రామం పై దండెత్తి గ్రామంలో బీభత్సం సృష్టించడమే కాకుండా ఐదుగురిని తొక్కి చంపాయి ఏనుగులు . లాడెన్  అనే  బారి ఏనుగు భారిన పడి    ఇప్పుడు వరకు స్థానిక గ్రామాల్లో  50 మంది ప్రాణాలు కోల్పోయారు. 



 ఏనుగులు గుంపులను  అధికారులు ఎన్నిసార్లు తరిమికొట్టిన  తరచూ మళ్ళీ వస్తుండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత  గ్రామస్తులు వినూత్న ఆలోచన చేశారు. జిరాఫీలు ఉన్న ప్రాంతానికి ఏనుగులు రావన్న   ఆలోచనతో అక్కడి స్థానిక గ్రామస్తులు పంటపొలాలు జిరాఫీ ప్రతిమలను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు వినూత్న ఆలోచన వల్ల ఏనుగుల గుంపు దాడుల బెడద   కాస్త తగ్గిందని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. పంట పొలాల్లో  జిరాపి బొమ్మ లు ఏర్పాటు చేయడం ద్వారా ఏనుగుల  దాడులు కాస్త తగ్గముఖం పట్టాయని చెబుతున్నారు . కానీ  పూర్తిస్థాయిలో మాత్రం ఏనుగుల  దాడులు తగ్గలేదని... పూర్తిస్థాయి ఫలితాల కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు అని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు చేసిన వినూత్న ఆలోచన  అధికారుల దృష్టికి రావడంతో అధికారులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: