క‌లియుగం అనేది పోయి స్మార్ట్ ఫోన్ల‌ యుగం వ‌చ్చిన‌ పుణ్యమా అని యువత వైఖరి మారింది. శృంగారంపై స్వేచ్ఛగా చర్చించుకుంటున్నారు. అధికశాతం మంది పోర్నోగ్రఫీ మాయలో పడ్డారు. డేటింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు ఆదరణ పెరిగింది. టీనేజ్‌లోనే ‘తొలి అనుభవాన్ని’ రుచి చూసేవారి సంఖ్య.. పోర్న్‌ వీడియోల మాయలో పడి ‘ప్రయోగాలు’ చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. గూగుల్‌ వారికో గైడ్‌గా మారింది.  ఇండియా టుడే ఢిల్లీలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండీఆర్‌ఏ) స‌హ‌కారంతో చేసిన స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.


ఇంటర్నెట్‌ విప్లవం ఏకంగా సెక్స్‌ ప్రపంచాన్నే అరచేతిలో పెట్టడం తో ప్రజల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్‌కు ఎక్కువగా ఆకర్షితులవడం, గర్భ నిరోధక మాత్ర అందుబాటులోకి రావడం కారణం కావొచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, డేటింగ్‌ యాప్స్‌ విచ్చలవిడి వాడకం శృంగారం దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. సైబర్‌ బ్లాక్‌మెయిలింగ్‌తోపాటు మహిళలపై, బాలలపై లైంగిక నేరాలూ పెరిగాయి.18 ఏళ్ల‌లోపే శృంగారంలో పాల్గొంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


19 నగరాల్లో ఇండియా టుడే ఢిల్లీలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండీఆర్‌ఏ) సహకారంతో  సర్వే చేయ‌గా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 14-29, 30-49, 50-69 ఏళ్ల‌ మధ్య వయస్కులను ఇంటర్వ్యూ చేశారు. మొత్తం 4,028 మందిని ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 20 వరకు సర్వే సాగింది. సర్వేలో పాల్గొన్నవారిలో సగటున 33% మంది టీనేజ్‌లోనే తొలి అనుభవాన్ని పొందినట్టు చెప్పారు. ఈ విషయంలో గువాహటి నగరవాసులు తొలిస్థానంలో (61% మంది) ఉన్నారు. 2003లో ఇది కేవలం 8 శాతమే కావ‌డం గ‌మ‌నార్హం.
మ‌రోవైపు....ఇంకో సంచ‌ల‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గణనీయ ప్రభావాన్నే చూపిందని తేలింది.  సెక్షన్‌ 377 రద్దు తర్వాత వారు తమ గుర్తింపును స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారట‌. ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం స్వలింగ సంపర్కం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారి సంఖ్య గత ఆరు నెలల్లోనే 45 శాతం పెరిగింది. అయితే, వివాహేతర సంబంధాలు నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక డేటింగ్‌ సైట్లలో ఎక్కువ మంది మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపింది. పురుషుల్లో 48% మంది, మహిళల్లో 3% మంది డబ్బు ఇచ్చి శృంగారంలో పాల్గొంటున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: