చాల కొత్తగా భిన్నంగా ఆలోచించడం లో విదేశీయులు ముందుంటారని మనం అనుకుంటాం కానీ అలోచించి చేసే పనిలో ఎవరికైనా కొత్త కొత్త ఐడియా తో పనులొచ్చేయొచ్చు అని నిరూపించిందొక మాతృమూర్తి కస్టాలు  వచ్చినపుడు రోదిస్తూ బాధపడుతూ కూర్చోవటం కంటే దానికి తగిన పరిష్కారం కోసం అలోచించి నిర్వర్తించే పనులు చాల వరకు ఆ కష్టాన్ని చాల వరకు తగ్గించొచ్చు అలాగే సమస్యకు సమాధానం కనిపెట్టొచ్చు.

మనం చేసే పనికి కొంచం ఆలోచన, ఐడియాలు ఉంటె కష్టాన్ని ఇష్టంగా సులువుగా చేయోచ్చు అని నిరూపించిన వార్త   వైరల్‌ అవుతుంది. ఈ వార్త చూస్తే మనం విదేశీయుల కంటే తక్కువేం కాదు అని అనుకోవచ్చు. ఇటీవల ఒక ప్రముఖ నటుడు తన బ్లాగ్ లో పెట్టిన చిత్రాలను చూస్తే నిజమే అని అనిపించక మానదు. అయన పెట్టిన స్థూలకాయస్థుడు కిందపడిపోకుండా తన కడుపుకు  అడ్డంగా చెక్కపలక పెట్టుకుని నిద్రపోవటం అలాగే  ఒక మహిళా తన బిడ్డను వంటింటి బీరువాలో పెట్టి వంట చేసుకోవడం మరియు స్నానానికి ముందు పిల్లాడిని వాష్ సింక్ లో కూర్చోబెట్టి తన పనులు చేసుకోవడం అలాగే ఒక ఒక వ్యక్తి  కళ్ళు మండకుండా  హెల్మెంట్ ధరించి ఉల్లిపాయలను తరగడం, బకెట్ కి రంద్రాలు చేసి షవర్ గ తాయారు చేయడం, గోడగడియారం మిగిలిపోతే గోడ పైన అంకెలు వేసి మాములుగా వాడుకోవడం లాంటివి చూస్తే కచ్చితంగా మొహం లో చిరునవ్వు రక తప్పదు కదా !!

కానీ ఆలోచిస్తే వాళ్ళు చేసిన ఆలోచనలకూ మాత్రం మెచ్చుకోవాల్సిందే అయితే ఈ ఫోటో లు ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన బ్లాగ్ లో పెట్టడం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఆ వ్యక్తులు వారు చేసిన చేష్టలకు ముందు నవ్వు తెప్పించిన చిన్న చిన్న సమస్యలను చాల సులభంగా కొత్త ఆలోచనలతో నిర్వర్తించడం చూస్తే ఆ తల్లిని మరియు ఆ వక్తులను వారి ఆలోచనలను మెచ్చుకోక తప్పరు  దీనిపై నెటిజన్లు స్పందిస్తూ దండలమ్మ!!!! అంటూ కొందరు నువ్వు సామాన్యురాలివి కాదమ్మా అని కొందరు రాసుకొచ్చారు.


కానీ కొందరు ఆ పిల్లడు బీరువా నుండి పడితే ఎలా అని మరికొందరైతే పిల్లాడికి జలుబు చేస్తే హాస్పిటల్ ల వైపు పరిగెత్తాల్సి వస్తుందని హేళన చేసారు. ఏది ఏమైనా ఆ ఆలోచనకి సలాం చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: