ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. 
 
గుంటూరు జిల్లా ఉండవల్లిలో నాగరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా పనులు లేకపోవటంతో నాగరాజుకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని అందువలన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులతో నాగరాజుకు తగాదాలు ఏర్పడ్డాయని మనస్తాపానికి గురైన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. 
 
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పొన్నూరులో కూడా మరో భవన నిర్మాణ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. స్థానిక అధికారులు మాత్రం నాగరాజు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమని చెబుతున్నారు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 
 
నాగరాజు భార్య ఒక భవనానికి వాచ్ మెన్ గా పని చేస్తుండగా నాగరాజు తాపీ పని చేసేవాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాడేపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నాగరాజు మృతి గురించి విచారణ చేపట్టారు. మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి నాగరాజు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇతర పార్టీల నేతలు ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ పెట్టటం వలన ఇసుక కొరత ఏర్పడుతుందని పనులు ఆగిపోయాయని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: