ప్రకాశం జిల్లా బలమైన నాయకుడిగా పేరు పొందిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి రాజీనామా చేయనున్నారనే వార్త జిల్లా రాజకీయాల్లో రౌండ్ అవుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ అనంతరం టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే.. వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఒక్క గొట్టిపాటి మాత్రమే. బలమైన ప్రజాకర్షణ ఉన్న గొట్టిపాటి  ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.

 


ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటితో మూడు నెలలుగా వైసీపీ ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గొట్టిపాటికి అద్దంకి నియోజకవర్గంలో చీమకుర్తి, బల్లికురువల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈమధ్య ఆ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు కూడా జరిగాయి. దీంతో ఆయన వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఒత్తిళ్లు భరించలేక వైసీపీ వైపు చుస్తున్నారనీ.. ఆయన అనుచరులు కూడా ఇదే మాట అంటున్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలు కూడా పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇటివల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమనైన గొట్టిపాటి అరగంట పాటు మాట్లాడారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గొట్టిపాటికి ఎదురైన ఇబ్బందుల గురించి వారిద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయట. వైసీపీలో చేరితే పర్చూరు ఇన్చార్జి బాధ్యతలు ఇస్తామని అంటున్నారట.

 


 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి జగన్ తో గొట్టిపాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గొట్టిపాటి వైసీపీని వీడడం అప్పట్లో సంచలనంగా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే క్లారిఫై చేయాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: