తెలంగాణలో ఆర్టీసీ  కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు  కార్మికులకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి .అయినా ఇన్ని రోజులు క్రిందికి దిగిరాని ప్రభుత్వం . కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరిన సమయంలో... రెండు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి... ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. రెండోది... ఆర్టీసీ సమ్మెపై కేంద్రం చొరవ చూపాలంటూ... రాష్ట్ర బీజేపీ వర్గం... కేంద్ర నాయకుల్ని కలవబోతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకులు... సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకునేలా చెయ్యాలని కోరారు. అంతే... ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇవాళ ఢిల్లీ వెళ్లి... బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసి... రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, తాజా పరిణామాలను వివరించబోతున్నారు. ముఖ్యంగా... కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ పోలీసు అధికారి చేయిచేసుకున్న అంశాన్ని కేంద్ర పెద్దల ముందు పంచాయతీ పెట్టబోతున్నారు.

అసలే తెలంగాణలో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... పాతుకుపోదామని ప్రయత్నిస్తున్న బీజేపీకి... ఆర్టీసీ సమ్మె, శుక్రవారం నాటి పరిణామాలు రాజకీయంగా కలిసొచ్చేలా ఉన్నాయి. మొన్నటి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో... ఢిల్లీ హైకమాండ్... రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై సీరియస్‌గా ఉన్న సమయంలో... సమ్మె ద్వారా తిరిగి ప్రజా మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి కేంద్రం కూడా సపోర్టుగా నిలిస్తే... ఈ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూస్తే... అది కేసీఆర్ సర్కారుకు ఇబ్బంది కలిగించే అంశమే. కేంద్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నదాన్ని బట్టీ... రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు ఆధారపడి ఉంటాయి.


ఐతే, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం... బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవనీ, హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలతో అది మరోసారి రుజువైందని అంటున్నాయి.ఓవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో... తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చేందుకు సీఎం ఇప్పటికే చాలా మంది నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు.  ఆర్టీసీపై సీఎం నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఈ భేటీతో అయినా కార్మికుల సమస్యలు తీరుతాయో లేదా ఎం,వారి ఉద్రిక్తం అవుతాయో చూడాలి,


మరింత సమాచారం తెలుసుకోండి: