దేశం లో   పెండింగ్ లలో ఉన్నవివిధ కేసులు వారం  రోజుల్లో విచారణ జరిగి తీర్పులు రానున్నాయి. దేశం లోని చాల రోజులుగా విచారణలో ఉన్న ముఖ్యమైన కేసులకు సంబంచిన తీర్పులను సుప్రీంకోర్టు వారి  తీర్పును  వెలువరించనుంది దీనితో దేశం లో శాంతి భద్రతలకు సంబందించిన అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు సమాచారం.

నవంబరు 4 నుంచి మూడు నాలుగు రోజుల్లో అయోధ్య రామ మందిరం కు సంబంచిన కేసులే కాకా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి  మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గత సంవత్సరం ఫిబ్రవరి  లో ఇచ్చిన తీర్పు మనకందరికీ విదితమే అది అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం నిషేధం. దీనిపై మహిళ హక్కుల కార్యకర్తలు దాఖలుచేసిన పిటిషన్లను విచారించిన పిదప వారికీ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.


దేని పైనే పునః పరిశీలన చేయడానికి దాఖలైన అంశం పైన పరిశీలించి  కొన్ని రోజులలో కోర్టు చివరి తీర్పు ని వెలువరించనుంది.  చరిత్రాత్మక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్ట్ ఏకాభిప్రాయంతో తీర్పుని  వెలువరిస్తుందా? లేదా ? అన్న అంశంపై చర్చ తీవ్రంగా సాగుతోంది. అలాగే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయం పైన , సీబీఐ డైరెక్టర్ల మధ్య వివాదంపై కూడా సుప్రీంకోర్టు తమ తీర్పును  వెల్లదించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇన్ని  కేసులు ఒకే సరి పది రోజులలో తీర్పుని వెలువరించడం తో అందరిలో ఉత్కంఠ  నెలకొంది. ఎలాంటి తీర్పు వొస్తుందో ఎలా ఆ తీర్పుని ప్రజలు తీసుకుంటారో అన్న ప్రశ్న అందరి మదిలో ఆలోచనను రెక్కేతిస్తుంది అదే కాకా ఇది మతాలకు సంబందించిన అంశాలు కాబట్టి ఏమి జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: