ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై అక్రమాస్తుల కేసులు నమోదవ్వగా...  దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపడుతుంది. గతంలో ఎంపీ గా ఉన్నప్పుడు సిబిఐ కోర్టుకు ప్రతివారం హాజరైనప్పటికీ...  జగన్ ప్రస్తుతం  ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో  తాను ప్రతి వారం కోర్టుకు హాజరు అయితే తన అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని... అంతేకాకుండా ప్రతి వారం కోర్టుకు హాజరు కావడం వల్ల 60 లక్షల వరకు ఖర్చు వస్తుందని... కోర్టుకు హాజరుపై తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్  పిటిషన్ దాఖలు చేసిన విషయం. అయితే దీనిపై గతంలో విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న జగన్ పిటిషన్ ను  కొట్టివేసింది. జగన్ కోర్టుకు తప్పక హాజరు కావాల్సిందిగా  కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ జగన్ పిటిషన్ సిబిఐ ప్రత్యేక కోర్టు సరైన తీర్పునిచ్చింది అంటూ విమర్శలు గుప్పించారు. 



 ఇదిలా ఉండగా  వైసిపి పార్టీపై జగన్ పై  విమర్శలు చేసిన వారిపై ప్రతి విమర్శలు చేస్తుంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా  చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు అని అన్నారు. 18 అవినీతి కేసుల్లో  స్టేలు తెచ్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సుమతి శతకాలు వల్లిస్తున్నారని  దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు... నలభై ఏళ్లుగా ప్రజలను దోచుకుంటూనే  ఉన్నారని... దాన్ని  ప్రజలు గుర్తించారు కాబట్టే పదవి నుంచి పీకేసి తరిమి కొట్టారు అని చెప్పారు.



 అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పు తప్పు అంటూ రంకెలేస్తున్నారంటూ   విమర్శించారు విజయసాయిరెడ్డి. ప్రజలు తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా కాలేదని... కానీ పరాజితులు అంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు  సంధించారు విజయసాయిరెడ్డి. అయితే వీళ్ల తీరు చూసిన వారికి అసహ్యం వేస్తుంనప్పటికి కూడా వీళ్లకి మాత్రం సిగ్గనిపించటం  లేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. వీళ్లకు పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కానీ మరో పదేళ్లు అయినప్పటికీ కూడా ప్రజాభిమానాన్ని సంపాదించుకోరni విజయ్ సాయి రెడ్డి విమర్శించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: