ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం థాయిలాండ్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ప్రధాని థాయిలాండ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 14వ తూర్పు ఆసియా సదస్సు, 16వ ఆసియన్‌ ఇండియా సదస్సు, మూడో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సుల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. అంతే కాకుండా ఇవాళ  బ్యాంకాక్ లో సావాస్  దీ  పీఎం  మోడీ కార్యక్రమంలో  ప్రధాని  మాట్లాడనున్నారు..


ఇకపోతే  థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ ఓ ఛా ఆహ్వానం మేరకు బ్యాంకాక్‌లో మోదీ పర్యటిస్తారు. రేపు మోదీ-ప్రయుత్‌ల సమావేశం జరగనుంది. వాణిజ్య, తీరప్రాంతాల భద్రత అనుసంధానంలో సహకారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన సాగనున్నది. ఇకపోతే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే నరెంద్రమోడీ విదేశీ ప్రయాణం కట్టారు. ఇక ఎన్నికల ప్రచారాల్లో చాలా చురుకుగా ప్రచారాన్ని నిర్వహించిన మోడీ ఎట్టకేలకు గెలిచి కమళం ఇంకా వాడిపోలేదని, తన హవా కేంద్రంలో ఇంకా వీస్తూనే ఉందని చాటారు.


ఇకపోతే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అతిపెద్ద ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూడా పట్టునిలుపుకున్నాయి. హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, మహారాష్ట్రలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు మహారాష్ట్ర,  హర్యానా ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి..


తాజాగా జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.. ఇక్కడ మొత్తం 81 శాసనసభ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు పోలింగ్ ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: