గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో అమలులో ఉన్న ఫ్రీ ఇసుక విధానాన్ని జగన్ రద్దు చేసి కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత ఏ మాత్రం తీరడంలేదు. దీనితో గత 5 నెలల నుండి భవన నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. రోజువారీ కూలీలు పనులు లేక తెగ ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూలీలు ఆత్మహత్యాయత్నానికి పాలుపడ్డారు. ఈరోజు గుంటూరు లో ఇద్దరు తాపీమేస్త్రి బలన్మరణానికి పాల్పడటం ఎంతో బాధాకరం. ఇదిలా ఉండగా కొందరు కార్మికులు ర్యాలీలు చేపట్టారు.


జెనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ కూడా కార్మికులకు పూర్తి మద్దతు ఇస్తూ ఈ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మెగా బ్రదర్ నాగబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో కామెంట్స్ చేసారు. కార్మికుల ఆత్మహత్యలు తనని ఎంతో విషాదపరిచాయని మీడియాతో చెప్తూ, పవన్ కళ్యాణ్ చేసే లాంగ్ మార్చ్ ని నాగబాబు మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కి సామజిక స్పృహ మెక్కువ అని అన్నారు. 


ఓదార్పు యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డికి కార్మికులు పడే ప్రస్తుత బాధలు తెలియకపోవదేంటి అని నాగబాబు ప్రశ్నించారు. కార్మికులకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని గట్టిగ ఎక్కడికక్కడ నిలదీస్తామని హామీఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడటం నాగబాబుకు ఇదేం మొదటిసారి కాదు. ఎలెక్షన్ సమయం లో ఆయన టీడీపీ పై ఎలా కామెంట్స్ చేసారో, ఇపుడు అలాగే వైస్సార్సీపీ పై విరుచుకుపడుతున్నారు. 


నిజానికి జబర్దస్త్ రోజా మరియు నాగబాబు మంచి స్నేహితులు. ఆర్కే రోజా సెల్వమణి వైసీపీ ఎమ్మెల్యే కావడంతో నాగబాబు వైసీపీ ప్రభుత్వం పై ఛాన్స్ వచ్చినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న స్నేహం ఎక్కడ పాడైపోతుందో అనే భయం తో విమర్శలు గుపించలేక సైలెంట్ ఐపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: