దేశంలో ఏర్పడిన కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చదనం పెంచేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని మోదీ కూడా పచ్చదనాన్ని పెంపొందించడం కు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా మనదేశంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించింది . మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  గ్రీన్ ఛాలెంజ్ ని  ప్రారంభించారు. 



 ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా  మనం 3మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి మొక్కలు నాటేందుకు చాలెంజ్ ఇస్తారు . ఇక ఈ ఛాలెంజ్  స్వీకరించి మరో ముగ్గురు కూడా మొక్కలు నాటాల్సి  ఉంటుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొక్కలు విరివిగా నాటడం వల్ల  పర్యావరణం కాలుష్యం తగ్గించడానికి మనవంతు కృషి చేయాలనీ  రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ప్రారంభించారు. కాగా  ఇప్పటికే ఆయన ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. 3  మొక్కలు నాటి  మరో ముగ్గురికి మొక్కలు నాటండి అంటూ ఛాలెంజ్  చేయటం  మరో ముగ్గురు కూడా మొక్కలు నాటడం ఇలా  ఇప్పటివరకు చాలా మంది సెలబ్రెటీలు ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 



 ఇప్పుడు తాజాగా భారత బాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు గ్రీన్ ఛాలెంజ్  పాల్గొన్నారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా  పీవీ సింధు గోపీచంద్ అకాడమీలో 3 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పి.వి.సింధు మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో పర్యావరణం రోజు రోజుకీ క్షీణిస్తున్న తరుణంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటూ సింధు  తెలియజేసారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన షట్లర్ పీవీ సింధు...  మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్  సింధు విసిరింది . సింధు చాలెంజ్ విసిరిన వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్,  ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీహైదరాబాద్ కి  చెందిన ప్రముఖ టెన్నిస్ స్టార్  సానియా మీర్జా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: