ఒకప్పుడు సమాజంలో వివాహబంధానికి ఎంతో విలువ ఉండేది.  భగవంతుడు, పెద్దల సాక్షిగా మూడు ముళ్ల బంధం..ఏడడుగులు నడిచి జీవితాంతం తోడూ నీడగా ఉంటామని బాస చేసిన దంపతులు ఇప్పుడు వివాహేతర సంబంధాలతో దారుణంగా చంపుకుంటున్నారు. ఇప్పటికే హయత్ నగర్ లో ప్రియుడి మోజులో పడి కనీ పెంచిన తల్లిని దారుణంగా హతమార్చింది కీర్తిరెడ్డి.  గుంటూరులో ఆస్తి కోసం కట్టుకున్న భర్త, ప్రియుడితో కన్నతల్లిని దారుణంగా తానే హత్య చేసింది మరో మహిళ.

ప్రపంచంలో భారతీయ సాంప్రదాయాలకు ముఖ్యంగా ఇక్కడ స్త్రీమూర్తులకు ఎంతో గౌరవం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి సాంప్రతాయాలు..కట్టు బొట్టు అంటే విదేశాల్లో ఎంతో గౌరవిస్తారు.  విదేశీయులు మన దేశానికి వచ్చి ఇక్కడ ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవాన్ని చూసి పొంగి పోతారు.  అలాంటిది ఇటీవల కాలంలో కొంత మంది మహిళలు చేస్తున్న నీచమైన పనుల వల్ల స్త్రీజాతి తలదించుకునే పరిస్థితి నెలకొంటుంది.  తాజాగా తన శృంగార కార్యాకలాపాలకు కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడని ఇద్దరు ప్రియులతో దారుణంగా హత్య చేయించింది ఓ నీచురాలు. అనంతరం ఎక్కడికో వెళ్లిపోయాడని కట్టుకథ అల్లినా పోలీసుల రంగ ప్రవేశంతో గుట్టురట్టయింది.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని ఐదు నెలల క్రితం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు శవం వద్ద లభించిన ఆధారాలను భద్రపరిచి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి శవానికి అంత్యక్రియలు జరిపించారు. మృతుని ఫొటోను అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు పంపించారు. ఇదిలా ఉంటే నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ వాసి గుజ్జేటి ఉదయ్‌కుమార్‌ (40), పావని అలియాస్‌ లావణ్య దంపతులు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే పావనికి అప్పటికే దౌలాజీ, చేంగల్‌కు చెందిన గంగాధర్‌తో వివాహేతర సంబంధాలు వున్నాయి. 

ఈ విషయం భర్తకు తెలిసి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.  దాంతో తన శృంగార కార్యాకలాపాలకు భర్త అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించాలని ప్రియులకు చెప్పింది. అనుకున్నట్లు గానే ఉదయ్ ని చంపేందుకు పథకం వేసుకున్నారు.  కూతురు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అవసరమైన డబ్బు దౌలాజీ, గంగాధర్‌ ఇస్తారని చెప్పి వారితో ఉదయ్‌ను ఆర్మూర్‌ పంపింది పావని. ముగ్గురూ పోస్కల్‌ వచ్చి మద్యం సేవించారు. పావనికి ఫోన్ చేసి చంపేయమంటావా అని అడగడంతో చంపేయండి చెప్పింది పావని.  అంతే ఉదయ్ ని గోదావరిలోకి తీసుకువెళ్లి ముంచి చంపేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు వచ్చేశారు.

అదే సమయంలో ఉదయ్‌కుమార్‌ కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త కనిపించకుండా ఐదు నెలలు హాయిగా తన ప్రియులతో ఎంజాయ్ చేస్తుంది పావని పై అనుమానంతో ఆమెపై నిఘా పెట్టారు పోలీసులు. దౌలాజీతో కలిసి పావని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్యోదంతం బయటపడింది. ఈ హత్యలో గంగాధర్ ఉండటం..ప్రస్తుతం అతను దుబాయ్ లో ఉండటతో ఇక్కడకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: