పాకిస్థాన్ ఒకనాటి భారతదేశమే. విడిపోయినా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లా ఒకే జాతి. కాని విశాల దృక్పదంలేని కొందరు ఇరుపక్షాల సంకుచిత మతస్వామ్యవాదులు  దిక్కుమాలిన భావజాలమే ఈ ప్రజల భూమి చీలిపోయింది. స్వతహాగా జన స్వభావం జతః రీత్యా ఒకటే అని ఋజువౌతూ వస్తూనే ఉంది.  ఇప్పుడు అదే ప్రజల ఆలోచన లతో పాక్ లో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పీఠం పునాదులు కదులు తున్నాయి.

అమిత ప్రజాదరణ గలిగిన ఇస్లామిక్‌ నేత, 'జమియత్‌ ఉలేమా ఎ ఇస్లామ్‌- ఫజల్‌ - జేయూఐ-ఎఫ్‌" పార్టీ అధినేత 'మౌలానా ఫజ్లుర్‌ రెహమాన్‌' నేతృత్వంలో వేలాది ఉద్యమ కారులు ఇస్లామాబాద్‌ చేరుకుని ఇమ్రాన్‌ ఖాన్ రాజీనామా చేయాలంటూ నినదించారు. ఆంతే కాదు రెండు రోజుల్లోగా ఆయన పదవి నుండి వైదొలగాలని, అప్పటి వరకు నగరాన్ని వదలిపోమని అంటూ ఫజలుర్‌ డెడ్‌లైన్‌ విధించారు.  అక్టోబరు 27న సింధ్‌ రాష్ట్రం నుంచి ‘ఆజాదీ మార్చ్‌’ పేరిట  పాద యాత్ర మొదలెట్టిన ఆయన, లాహోర్‌, గుజ్రన్‌ వాలా మీదుగా నిన్న (శుక్రవారం) తెల్లారు ఝామున ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. వేలాది పాక్ ప్రజ ఆయన వెంట నడిచారు.
Image result for gallup gilani international survey on pak economy

*దేశ ఆర్థిక రంగ పతనానికి ఇమ్రానే కారణమని, ఆయనో కీలుబొమ్మ అని, రిగ్గింగ్‌ చేసి గెలిచారనీ ఫజ్లుర్‌ రెహమాన్‌  ఆరోపిస్తున్నారు. ఆయనకు రెండు ప్రధాన విపక్షాలు- పీపీపీ, పీఎంఎల్‌ (ఎన్‌), అవామీ నేషనల్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

*ఫజ్లుర్‌ రెహమాన్‌  తో పాటు బిలావల్‌ భుట్టో, పీఎంఎల్‌ అగ్రనేత షెహ్‌బాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. “ఆజాదీ మార్చ్‌” ను ఒక రాజకీయ స్టంట్‌ గా ఇమ్రాన్‌ ఖాన్‌ కొట్టి పడేశారు. రాజీనామాకు రెండ్రోజుల గడువును కూడా తిరస్కరించారు.  ఇస్లామ్‌ పేరు చెప్పి అధికారంలోకి రావాలనుకునే రోజులు పోయాయని ఆయన 'గిల్జిట్‌-బాల్టిస్థాన్‌' లో ఒక కార్యక్రమంలో అన్నారు. ఫజ్లుర్‌ రెహమాన్‌ భారత ఏజెంట్ అని ఇమ్రాన్‌ ఆరోపించారు.

Image result for gallup gilani international survey on pak economy

ఇదిలా ఉండగా కశ్మీర్‌ కంటే దిగజారి పాతాళంలో పడిపోతున్న దేశ ఆర్థికపరిస్థితే పెద్ద సమస్యగా 53% పాకిస్థానీలు భావిస్తున్నట్లు ఒక సర్వే తెలిపింది పాకిస్థాన్ ప్రజలు కశ్మీర్ అంశానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని “గాలప్- గిలానీ ఇంటర్నేషనల్ సంస్థ”  అధ్యయనంలో స్పష్టమయ్యింది  ఆ సర్వేని ఇమ్రాన్ లాంటి పాక్ పెద్దలు  పెద్దగా పట్టించుకోవడం లేదని,  కశ్మీర్ కాదు – దేశంలోని ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రధాన సమస్యలని జనం ముక్తకంఠంతో వెల్లడించారు.

ధరలను నియంత్రించడం లోనూ, ఉద్యోగ కల్పన లోనూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. పాకిస్థాన్‌ లో వాస్తవ పరిస్థితులకు గాలప్ - గిలానీ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయి. వీటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించి రాజకీయ ప్రయోజనం పొందటానికి ఉగ్రవాదుల ఆశయాన్ని ఇమ్రాన్ ఖాన్ నెత్తినపెట్తుకున్నాడని పాక్ ప్రజ ముక్తకంఠంతో భావిస్తున్నారు.

Image result for gallup gilani international survey on pak economy

ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు 53 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 23శాతం మంది నిరుద్యోగాన్ని, 4 శాతం మంది అవినీతిని, మరో 4 శాతం మంది ప్రజలు నీటి కొరతను సమస్యగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. రాజకీయ అస్థిరత, డెంగీ విజృంభణపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

కేవలం 8 శాతం మంది పాక్ ప్రజలు మాత్రమే కశ్మీర్‌ ను ప్రధాన సమస్యగా భావిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని తరుచూ ప్రస్తావిస్తూ రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజల నుంచి మద్దతు లేనేలేదని తేటతెల్లమయ్యింది. పాక్ ప్రజలు కేవలం 8 శాతం మంది మాత్రమే దేశానికే మాత్రం ప్రయోజనం ఇవ్వని ఈ విషయానికి మద్దతు పలకటం ఇమ్రాన్‌ కాదు – ఆ దేశంలో పుట్టి, విదేశాలకు ఎగుమతై, కుళ్ళి కంపు కొట్టే ఉగ్రవాదానికి, కూడా చెంపపెట్టే నని చెప్పాలి.

Image result for gallup gilani international survey on pak economy

Pakistanis feel inflation, not kashmir, is bigger problem facing them: Survey

మరింత సమాచారం తెలుసుకోండి: