జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ పై అధికార వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు ఇవ్వడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ చేస్తోంది లాంగ్‌ మార్చా?... రాంగ్‌ మార్చా?. ఉనికి కోసమే ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అంటూ జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు.


ఇక పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం హయాంలో ఇసుకలో వాటా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవన్‌ లాంగ్‌ మార్చ్‌ అంటున్నాడు. చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఒక్క ఇసుక లారీని సీజ్‌ చేశారా? అని అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వర్షాలు పడటం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారన్నారు. తాజాగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాబు ఇసుక దోపిడీలో పవన్ కళ్యాణ్ కు వంద కోట్లు దక్కాయని ఆరోపించారు. పవన్ పోరాట౦ ప్రజల కోసం కాదు బాబు ప్యాకేజ్ కోసమని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.


రాష్ట్రంలో వర్షాలు పడటం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదన్నారు ఆయన. లాంగ్ మార్చ్ అనే పధం పవన్ కళ్యాణ్ కి సూట్ అవ్వదు అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మంత్రి కురసాల కన్నా బాబు కూడా పవన్ లాంగ్ మార్చ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ దీక్ష చేస్తున్నారని, నిజంగా పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని కన్నబాబు ప్రశ్నించారు. కాగా పవన్ పిలుపునిచ్చిన ఈ లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు హాజరువుతున్న సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: