తెలుగు రియాలిటీ కార్యక్రమం  బిగ్‌బాస్ 3 కార్యక్రమం  రేపటితో ముగియనుండడడం తో ప్రేక్షకులలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ మొదలయంది.  మొత్తం పది హేను మంది అబ్యర్దులకు గాను, రెండు వైల్డ్ కార్డ్ ప్రవేశం తో , ఒకరి  రీఎంట్రీ ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకొని ముగిసేందుకు వచ్చింది.

గత సంవత్సరం లో జరిగిన బిగ్‌బాస్ 2 కౌశల్ ఆడిన విధానానికి అతని పైన చూపిన ఆదారాభిమానాలకు ఎంతో మంది వోటింగ్ ద్వారా విజేతగా నిలబెట్టారు. అలాగే కౌశల్ పేరిట కౌశల్ ఆర్మీ అని ఏర్పాటు చేసి అయన పేరిట ర్యాలీలు తీయడం, ప్రకాహారాలు చేయటం ఆ రోజుల్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే  అభ్యర్థులు అతడిని ఏకాకి ని చేసి  అతడిని చాల ఇబ్బందులకు గురిచేసారు అతడిని  ఒంటరిని చేసి ఆదుకోవడం తో  అతనిపై ప్రజల్లో ప్రేక్షకుల్లో చాల అభిమానం పెరిగిపోయంది .అలాగే అందరు ప్రతిసారి కావాలని అతడిని నామినేట్ చేయడం అతడిపైన ఉన్న అభిమానం ఎంత ఉంది అనే విషయం అందరికి అర్ధం అయిపోయంది. అలా ప్రతిసారి సేవ్ అవ్వడం నామినేట్ అవ్వడం చుసిన ప్రేక్షకులకు కౌశల్ ని టార్గెట్ చేసారు అని అనిపించి చివరి వరకు అతడిని సేవ్ చేస్తూ వచ్చి విజేతగా నిలబెట్టారు.

అయితే ఎప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ త్రీ లో గతానికి బిన్నంగా ఉంటూ వచ్చింది ఇందులొ చివరగా  రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా మొదటి 5స్థానాలలో  అభ్యర్థులుగా మిగిలారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోటాస్క్ లు  ఆడకుండా ఆవేశాలకు, గొడవలకు వేళ్ళని వ్యక్తిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు తెచ్చుకున్నాడు అలాగే ఎక్కువసార్లు నామినేట్ ఆయన వ్యక్తిగా కూడా ఇతడికి పేరుంది. ఏది ఉన్నా మొహం మీదే చెప్పడం ఏదైనా విషయాన్నీ ఉడుకు దొడుకులు లేకుండా చెప్పడం లో అయన   వ్యవహరించడంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే అయన వాడే బాషా కొంచం ఇబ్బంది గ ఉంది అనే వ్యతిరేకత వచ్చింది కానీ వాటిని అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఎక్కువసార్లు నామినేట్ ఆయన రాహుల్ ఏ సీజన్లో విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది అలాగే అతడే విజేత  అని ప్రచారం  చేస్తున్నట్లు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: