దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. మామూలుగానే దేశ రాజధాని ఢిల్లీల వాయు కాలుష్యం తీవ్రత అతి ఎక్కువగా ఉంటుంది. ఇక కొన్నిసార్లు ఆ తీవ్రత కాస్త ఎక్కువ అవడంతో ప్రభుత్వం తగ్గించడానికి పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రము మొత్తం పొగ మంచు కమ్మినట్టుగా  దేశ రాజధానీలో  వాయుకాలుష్యం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం వాయు కాలుష్యంతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థల అన్నిటికి సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు సీఎం కేజ్రీవాల్. కాగా ఢిల్లీలో రేపు భారత్ బంగ్లాదేశ్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరుగనుంది. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్టు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీలో తీవ్రమైన వాయుకాలుష్యం నేపథ్యంలో... ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 



 ఈ క్రమంలోనే  టీమిండియా ఆఫ్ స్పిన్నర్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మనిషి తీసుకునే ఊపిరిలో  తగినంత ఆక్సిజన్ ఉండాలని కానీ ఢిల్లీలో  పెరిగిన వాయు కాలుష్యం దృశ్య  ... ఢిల్లీలో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అశ్విన్ తెలిపారు . దేశ రాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత క్షీణించిందని ఆక్సిజన్ శాతం కూడా చాలా తక్కువ ఉందని పరిస్థితి  ఇబ్బందికరంగా   ఉందంటూ పేర్కొన్నాడు అశ్విన్ . తమకు ఆటలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ అశ్విన్ తెలిపాడు. ఇక అంతకుముందు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బీసీసీఐ  అధ్యక్షుడు గంగూలి  తో మాట్లాడాడు. ఢిల్లీ లో  ఉన్న  వాయు కాలుష్యంతో తామేమీ ఇబ్బంది పడబోమని  రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ సజావుగా  జరుగుతుందని  జరుగుతుందని రోహిత్ శర్మ భరోసా ఇచ్చాడు. 



 ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డోమింగ్  కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పడ్డ కాలుష్యం పై ఇదే తరహాలో అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రతరం అయిన మాట నిజమే... కానీ మూడు గంటలు మైదానంలో గడిపినంత  మాత్రాన చచ్చిపోము  కదా అంటూ వ్యాఖ్యానించాడు . కాగా  దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమైన నేపథ్యంలో ప్రజలు కూడా పలు రోగాల బారిన పడి  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ పిల్లలు బయటకు వచ్చి తమ ఆరోగ్యం పాడవకూడదనే ఉద్దేశంతో... ఢిల్లీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా  వ్యాప్తంగా ఉన్న స్కూల్ అన్నింటికి ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం వాయు కాలుష్యం ఢిల్లీ రాజధాని లో తీవ్రం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: