ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఆదివారం విశాఖలో జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్‌ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులను, మిగితా పార్టీల నాయకులను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. దీంతో బీజేపీ వారు మద్దతు ఇవ్వకుండా.. మేము ఇప్పటికే ఇది చేస్తున్నాం పవనూ అని చెప్పగా...           


చంద్రబాబు నాయుడు మాత్రం మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం ఆంధ్రాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సభలకు పచ్చబలగం ఉందని ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ మంత్రి వ్యాఖ్యానించాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ మంత్రి ఎవరు ? ఎందుకు అన్నాడు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ మంత్రి ఎవరో కాదు వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 


రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమే అని, వరదల వల్లే కొరత ఏర్పడుతుందని.. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ, జనసేన పార్టీ నేతలు మాట్లాడటం సరికాదని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ పై కూడా కొందరు రాష్ట్ర మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికుల కష్టాలు ఉన్నాయని, అయితే ఆ కష్టాలను ఎవరు పట్టించుకోలేదని, అప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా వారి ఇబ్బందులు కనిపించలేదని ప్రశ్నించారు. అయితే ఇది అంత రాజకీయ నాటకం అని ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తూ, రాజకీయ లబ్ధికోసమే దీక్షలు చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: