ఖమ్మంలోని సత్తుపల్లి మండలంలో దొంగనోట్లను సరఫరా చేస్తున్న దొండగులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 7 కోట్ల విలువైన దొంగ నోట్లను స్వాధీనపరుచుకున్నారు. విదేశాలనుండి వస్తున్న ఈ దొంగ నోట్లు భారతదేశ ఆర్థికవ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాయి. నోట్ల రద్దు అయినప్పటికీ, ఈ నకిలి నోట్ల చెలామణి ఏ మాత్రం ఆగడంలేదు. భారీ మొత్తంలో దొంగనోట్లు దొరకడంతో, ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ, దొంగ నోట్ల కేటుగాళ్లని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేటుగాళ్లు అమాయకులకు ఆశ చూపి మోసాలకు పాటుపడుతున్నట్లు సీపీ చెప్పారు. 


ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నమని, మిగతా వాళ్ళు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొంగ నోట్ల తో సహా, రెండు కార్లను సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సత్తుపల్లి కేంద్రంగా ఈ నకిలీ నోట్ల కార్యకలాపాలు జరిపిన ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనూ మోసాలకు పాలుపడినట్లు చెప్పారు. నకిలీ నోట్లను చెలామణి చేస్తే కమిషన్ ఇస్తామని అమాయకులతో మార్పిడి చేసారని సమాచారం. 


పట్టుపడిన నేరస్థులని కస్టడీలోకి తీసుకొని క్షుణ్ణం గా విచారిస్తామని సీపీ మీడియా తో చెప్పారు. ఈ ముఠా కి అసలైన లీడర్ ఒక పాత నేరస్థుడని, అతను మదార్‌ మియాగా గుర్తించామని పోలీస్ చెప్తున్నారు. ఇంత పెద్ద నకిలీ నోట్ల ముఠాని పట్టుకునేందుకు పోలీస్ సిబందిని కమిషనర్‌ ఇక్బాల్‌ అభినందించారు. అలాగే ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరేనా తమ దగరికి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 


ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ముద్రణ అయ్యి బంగ్లాదేశ్ మీదుగా వస్తున్న ఈ నకిలి నోట్ల సరఫరాని ఆపడం ఎవరి వల్ల అవడంలేదు. ఈపటివరకు దొరికిన దొంగనోట్ల ముఠాలో, ఈ ముఠా ఒక పెద్దదే అని చెపుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: