తెలంగాణలో గత 28 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన విధంగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. కానీ సమ్మే  మొదలైనప్పటి నుండి  ఇప్పుడు వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కార్మికుల డిమాండ్ల  పరిష్కారం దిశగా ఆలోచన చేయలేదు. ఈ నేపథ్యంలో రోజు రోజు కు సమ్మె ఉదృతం అవుతున్న  నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై  ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల విషయంలో  కేసీఆర్ తీరుపై  ఆంధ్రప్రదేశ్  నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా కాస్త ఘాటుగానే స్పందించారు. ఏపీ లోని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మీటింగ్ లో పాల్గొన్న రోజా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసి సమ్మె పై విమర్శలు చేశారు. 




 తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నపటికి  కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధాక్షిణ్యంగా కార్మికులను  ఉద్యోగుల నుంచి తీసేసారు అని  రోజా వ్యాఖ్యానించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆర్టీసీ కార్మికులు ఎంతో అదృష్టవంతులు అంటూ  రోజా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో  తెలంగాణ లాంటి పరిస్థితులు లేవని ఇక్కడ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా బేషరతుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసామంటూ... కొన్ని రోజుల క్రితం రోజా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నగరి ఎమ్మెల్యే రోజాను పిలిచి  వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజాకు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు  సమాచారం. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె పై ఎవరిని అడిగి బహిరంగ వ్యాఖ్యలు చేశారంటూ నగరి  ఎమ్మెల్యే రోజుని జగన్ మందలించారంటూ ఎపి  రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్నారు. ఇకనుంచి తెలంగాణ, కేసీఆర్ విషయమై వైసీపీ పార్టీ నేతలు  బహిరంగంగా విమర్శలు చేస్తే  పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని పరోక్షంగానే జగన్ అందరిని  హెచ్చరించినట్లు సమాచారం. 



 ఈ నేపథ్యంలోనే నగరి  ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ సమ్మెపై కాస్త సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.వైసీపీ నేతలందరూ  కూడా ఎవరిని విమర్శించాల్సి  వచ్చిన పార్టీపరంగా ఆదేశాలు వచ్చాకే  విమర్శలు చేయాలని పార్టీ పరంగా అల్టిమేట్టం  జారీ చేసినట్లు తెలుస్తుంది.ఇక  పార్టీలో ముఖ్య నేతగా ఉన్న రోజా ని జగన్ క్లాస్ పీకడంతో మిగతా నేతలు కూడా అనవసర విమర్శలు చేయకుండా కాస్త అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కువైపోయిన  నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న నిర్వహించినున్న  లాంగ్ మార్చ్ పై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశాలతోనే విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని అధికార వైసీపీ నేతలు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: