ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పోలీసు బందోబస్తుతో సహా అనుమతి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ ప్రత్యేక హోదా కోరుతూ ఆర్కే బీచ్ లో కొవ్వొత్తుల ర్యాలీ కొరకు రాగా చంద్రబాబు జగన్ ను విశాఖ విమానశ్రయం నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునేలా చేశారు. ఎయిర్ పోర్టు చుట్టూ భారీగా పోలీసులను మోహరించి జగన్ ను చంద్రబాబు అడ్డుకున్నారు. 
 
సీఎం జగన్ అమరావతిలో మీటింగ్ పెట్టాలన్నా, జగన్ పాదయాత్ర చేసే సమయంలో కూడా చంద్రబాబు పోలీసుల ద్వారా జగన్ కు అనుమతులు రాకుండా చేసి ఇబ్బందులకు గురి చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నప్పటికీ పవన్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా అనుమతులు ఇవ్వటమే కాకుండా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 
 
ఏ విశాఖపట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీని చంద్రబాబు అడ్డుకున్నాడో అదే విశాఖపట్టణంలో వేరే పార్టీకి చెందిన నేతకు లాంగ్ మార్చ్ కు అనుమతి ఇచ్చి జగన్ తన వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను నిరూపించుకున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు చంద్రబాబు నాయుడు నవ్వులపాలయ్యాడు. చంద్రబాబు జగన్ కు ర్యాలీకి అనుమతిస్తే భారీగా ప్రజలు హాజరైతే తమ పార్టీ పరువు పోతుందని భయపడగా జగన్ మాత్రం ఇతర పార్టీ నేతలు చేస్తున్న ర్యాలీకి తన వంతు సహకారం అందిస్తున్నాడు. 
 
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇతర పార్టీ నేతల పోరాటాల్ని తొక్కేయాలని చూస్తుంటే ముఖ్యమంత్రిగా కేవలం ఐదు నెలల పరిపాలన అనుభవం ఉన్న జగన్ మాత్రం తనదైన మార్కు పరిపాలనతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు అప నమ్మకంతో పరిపాలన సాగిస్తే జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో తన పర భేదం లేకుండా ఉన్నతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నిజ స్వరూపం తెలిసింది కాబట్టే 2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలయిందని చంద్రబాబు నిజ స్వరూపం పవన్ కు అర్థమైతే పవన్ చంద్రబాబుకు దూరం కావటానికి ఎంతో సమయం పట్టదని అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: