దేశ పౌరులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కాపాడాల్సిన పోలీసులే విచక్షణ మరిచారు. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన లాయర్లే తమ ధర్మాన్ని మరిచారు.వీరిద్దరికి ఉండాల్సింది ఓర్పు, సహనం.. కానీ ఆ రెండు లోపించడంతో.. పెద్ద వివాదమే చెలరేగింది.
ఈ వివాదం ఎక్కడో జరిగితే వేరే విషయం కానీ ఏకంగా కోర్టు ముందె వీరు విచక్షణ కోల్పోయారు.

దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారా కోర్టు ముందు.. పోలీసులు, న్యాయవాదుల మధ్య ఘర్షణ తలెత్తింది.దీంతో కోర్టు ఆవరణలోనే ఇరువురు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.చిన్న సైజు మారణ కాండను తలపించిన ఈ వివాదంలో ఆస్తినష్టం తప్పితే ప్రాణ నష్టం జరగలేదు.వివాదం మాటలను మించి  అక్కడే ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టె వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ఓ పోలీస్ వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది.

అసలు వీరి  ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడానికి కారణం తెలిస్తే ఖంగు తింటారు.కోర్ట్ ఆవరణలో  పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్లకు మధ్య తలెత్తిన వివాదమే.. ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. మూడో బెటాలియన్‌కు చెందిన కొందరు పోలీసులు.. తమపై దాడికి దిగడమే కాకుండా.. తమపై కాల్పులు కూడా జరిపారంటూ లాయర్లు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది. దీంతో తీస్ హజారా కోర్టు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా అమానుషంగా ప్రవర్థించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ఇలా ప్రభుత్వ ఆస్తులని తగలబెట్టే వరకు దీన్ని ఎవరు అడ్డుకోకపోవడం శోచనీయం.మంటల్లో తగలబడిపోతున్న దృశ్యాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: