రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాలో ఉంది. ఈ నేప థ్యంలో త‌న బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జన ప‌డుతున్నారు. దీంతో ఉన్న‌వీ లేనివీ క‌లిపి.. మొత్తంగా క‌ల‌గా పుల‌గం చేసి మ‌రీ .. వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. అయితే, ఇవి ప్ర‌జ‌ల్లోకి అంత‌గా వెళ్ల‌డం లేదు. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన విస్తృత స్థాయి స‌మావేశంలో చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చేశారు.


ఆఫ్‌దిరికార్డుగా త‌మ్ముళ్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ.. విమ‌ర్శ‌లు ప‌దునుగా ఉండాల‌ని సూచించారు.దీంతో ఒక‌రిద్ద‌రు మాజీ మంత్రులు మేం బాగానే మాట్లాడుతున్నాం సార్‌.. కానీ స‌బ్జెక్టే దొర‌క‌డం లేదు.. ఏం మాట్లాడి నా అతికిన‌ట్టు ఉంటోంద‌ని అన్నార‌ట‌. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి బాగా క‌నెక్ట్ అయ్యార‌ని, గ‌తంలో మ‌నం ఎన్నిప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ఈ రేంజ్‌లో ప్ర‌జ‌ల‌లోకి వెళ్లలేద‌ని వ్యాఖ్యానించార‌ట‌. దీంతో చంద్ర‌బాబు అవాక్క‌య్యార‌ట‌.
అదే స‌మయంలో ఒక్క నిముషం పాటు తేరుకుని.. అయితే, నాయ‌కుల‌ను కూడా మ‌న‌మే సృష్టించాలి..! అని వ్యాఖ్యానించార‌ట చంద్ర‌బాబు.

ప్ర‌భుత్వాన్నిఇరుకున పెట్టేలా.. నాయ‌కుల‌ను మ‌న‌మే త‌యారు  చేయాల‌ని, విమ‌ర్శ‌లు చేసేందుకు నాయ‌కులు ముందుకు రావాల‌ని అన్నార‌ట‌. దీంతో అంద‌రూ మౌనం వ‌హించ‌గా.. కొంద‌రు మాత్రం త‌మ వేళ్ల‌ను ఎంపీ కేశినేని నాని వైపు చూపించార‌ట‌. ఆయ‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించండి.. ఆయ‌నైతే.. షార్ప్‌గా వాయించి ఒదిలి పెడ‌తారు అన్నార‌ట‌.


దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావించార‌ట‌. అయితే, ఇంత‌లోనే ఆయ‌న మ‌రుస‌టి రోజు వైసీపీ ఆర్టీసీ విలీన ప్ర‌క‌ట‌నను మెచ్చుకుంటూ మీడియా ముందే జ‌గ‌న్ను మెచ్చుకోవ డంతో చంద్ర‌బాబు అవాక్క‌యి.. కొత్త నేత‌ల కోసం బూత‌ద్దం ప‌ట్టుకునివెతుకుతున్నార‌ట‌. సో.. టీడీపీలో ఇదీ ప‌రిస్థితి. సో మ‌రి బాబుకు ఇలా చేసే కొత్త నాయ‌కులు ఎప్ప‌ట‌కి దొరుకుతారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: