ప్రధానిగా మోడీ  సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలోనే కొన్ని దశాబ్దాలుగా వీడని 370 ఆర్టికల్ రద్దు వివాదాన్ని  మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి సంచలనం సృష్టించింది.గొప్ప గొప్ప రాజకీయా వేత్తలకే సాధ్యం కానిది మోడీ సుసాధ్యం చేసి చూపించారు.  ఇప్పుడు వరకు జమ్ము కాశ్మీర్ భారత భూభాగంలో ఉన్న రాష్ట్రం అయినప్పటికీ జమ్ము కాశ్మీర్ కి 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో త్రివర్ణ పతాకం ఎగుర వేస్తే ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం సపరేట్ జెండా ఎగురుతుంది. కాగా  మోడీ సంచలన నిర్ణయం తో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి కూడా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కాకుండా  భారతదేశంలోని ఒక భూభాగం గానే పరిగణించేలా  నిర్ణయం తీసుకున్నారు. మోడీ  నిర్ణయంతో అప్పట్లో కొన్ని రోజులు జమ్మూకాశ్మీర్ లో  అల్లర్లు కూడా జరిగాయి. 

 

 

 

 జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని  కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుస్తూనే  అందులోని లఢక్  ప్రాంతాన్ని మరో కేంద్రపాలిత ప్రాంతం గా మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 370 ఆర్టికల్ రద్దు తోనే కొత్త అధ్యాయానికి మొదలుపెట్టారు ప్రధానమంత్రి. 370 ఆర్టికల్ రద్దు సంచలన నిర్ణయం ఫలితంగా దేశ చరిత్రలోనే కొత్త శకం ప్రారంభమైంది. దీంతో  దేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. అయితే పీఓకే జమ్మూకాశ్మీర్లోనే  ఉంటుందని అందరూ భావించారు. కానీ దాన్ని లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చాలని  కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కార్గిల్, లెహ్ జిల్లాలు ఇప్పుడు లఢక్ లోనే  ఉన్నాయి. 

 

 

 

 అయితే గతంలో భారత దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలే  ఉన్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో  మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలుగా  ఉండేవి.తాజాగా  కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అక్టోబర్ 31 నుంచి దేశంలోని రాష్ట్రాల సంఖ్య 28కి మారింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 25 జిల్లాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండగా... లఢక్ ను  అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ భూభాగాల కు సంబంధించి కొత్త భారతదేశ చిత్రపటాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగా 370 ఆర్టికల్ రద్దు సంచలన నిర్ణయం తర్వాత జమ్మూకాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి తర్వాత... ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: