రాష్ట్రంలో బీజేపీ చిత్ర‌మైన ప‌రిస్తితిని ఎదుర్కొంటోంద‌ట‌. ఆర్థికంగా నాయ‌కులు తీవ్ర‌మైన ఇబ్బందులు ప డుతున్నార‌ట‌. ఇప్పుడు ఇదే విష‌యంపై స్తానిక నాయ‌కులు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నార‌ని అంటు న్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే కొలువుదీరినా.. రాష్ట్రాల‌కు నిధులు ఇచ్చే విష‌యంలో బీజే పీ నాయ‌క‌త్వం కొన్ని లెక్క‌లు వేసుకుని ముందుకు సాగుతున్న‌ట్టు చెబుతున్నారు. ఏ పార్టీ అయినా.. రాష్ట్రా ల్లో పుంజుకోవ‌డం అనేది ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత ఈజీకాదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారంలోనే ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా అధికారం కోల్పోయేస‌రికి అప్పుడే త‌మ‌కు ఆర్థిక క‌ష్టాలు వ‌చ్చాయంటూ ఇటీవ‌ల సాక్షాత్తూ చంద్ర‌బాబే చెప్పుకొచ్చారు.


అలాంటిది.. ఒక్క‌చోట కూడా ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేక పోయిన బీజేపీకి ఇంకెన్ని క‌ష్టాలు ఉంటాయి? ఇప్పుడు ఈ క‌ష్టాలే పార్టీని, నేత‌ల‌ను వెంటాడుతున్నాయ‌ట‌. తాజాగా రాష్ట్రంలో మ‌హాత్ముడి పేరుతో సంక‌ల్ప యాత్ర చేప‌ట్టారు. దీనికి సంబంధించి బ్యాన‌ర్లు, భోజ‌నాలు, కార్య‌క‌ర్త‌ల ఖ‌ర్చు వ‌గైరా కోసం లెక్క‌లు వేస్తే.. దాదాపు మూడు కోట్ల రూపాయ‌లు లెక్క తేలింద‌ని తెలిసింది. అది కూడా రూపాయి రూపాయి గీసి గీసి ఖ‌ర్చు చేస్తేనే మూడు కోట్లు తేలింద‌ని తెలియ‌డంతో ఈ ఖ‌ర్చు ఎవ‌రు భ‌రించాల‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నించారు.


దీంతో ఆయ‌న మీమీ జిల్లాల్లో అయ్యే ఖ‌ర్చును మీరే పెట్టుకోవాలి. త‌ర్వాత అధిష్టానం ఇస్తే.. మేం స‌ర్దు బాటు చేస్తాం అంటూ ముక్తాయించార‌ట‌. దీంతో ఒక్క‌సారిగా క‌మ‌లం పార్టీ నాయ‌కులు మొహాలు వేలాడే సుకున్నార‌ట‌. మేం కార్య‌క‌ర్త‌ల‌నైతే తీసుకువ‌స్తాం. ఓ వంద నుంచి రెండు వంద‌ల మందికి భోజ‌నాలు పెడ‌తాం కానీ, కార్య‌క‌ర్త‌ల‌కు డ‌బ్బులు, బ్యాన‌ర్ల ఖ‌ర్చు , మీడియా ప్ర‌చార ఖ‌ర్చు వంటివిమాత్రం భ‌రించే శ‌క్తి త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. దీంతో కన్నా ఈ విష‌యాన్ని సుజ‌నా చౌద‌రి స‌హా విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి, దేవ్‌ధ‌ర్ వంటి కీల‌క నాయ‌కుల‌కు చెప్పిన‌ట్టు తెలిసింది.


దీంతో వారు కూడా చేతులు తిప్పుతూ.. తామేమీ చేయ‌లేమ‌ని, రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఇది నీ క‌ర్త‌వ్య‌మ‌ని, డ‌బ్బులు ముందు ఏదో ఒక విధంగా స‌ర్దుబాటు చేసుకుంటే.. త‌ర్వాత అధిష్టానం నుంచి ఇప్పిస్తామ‌ని అన్నార‌ట‌. దీంతో త‌న‌కున్న పొలాన్ని తాక‌ట్టు పెట్టిన క‌న్నా.. రెండు కోట్ల వ‌ర‌కు తెచ్చి స‌ర్దుబాటు చేశార‌ట‌. అయితే, ఇప్పుడు అధిష్టానం ఈ సొమ్మును ఇచ్చేందుకు విముఖ‌త వ్య‌క్తం చేస్తోంద‌ని తెలియ‌డంతో క‌న్నా దిగాలు ప‌డిపోయారు. రాష్ట్రంలో ఓ న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎంతో కొంత స‌ర్దుబాటు చేసేవార‌ని ఆయ‌న క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రితోనూ చెప్పుకొంటున్నార‌ని తెలిసింది. సో.. ఇదీ రాష్ట్రంలో బీజేపీ ఆర్థిక ప‌రిస్థితి!



మరింత సమాచారం తెలుసుకోండి: