ఏపీలోభావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే విధంగా... మీడియాను కట్టడి చేస్తూ...  జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 అమలుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.    దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో కలానికి కళ్లెం వేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా  ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ జీవోపై మండిపడ్డారు.  తాజాగా, జీవో 2430 వివాదాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది.  జీవోపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. 


ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీచేసిన 2వేల 430 జీవో.... జర్నలిస్టుల విధి నిర్వహణకు భంగకరంగా ఉందని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని... పీసీఐ ఛైర్మన్‌ జస్టిస్ చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. 
 ఈ జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని అభిప్రాయపడింది.

తప్పుడు, నిరాధార, పరువుకు భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తే... వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖల కార్యదర్శులకు అనుమతి ఇస్తూ అక్టోబర్‌ 30న ఈ జీవో జారీచేశారు. ఏపీ సర్కారు విడుదల చేసిన 2430జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.  అంతేగాక, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, సంస్థలపై చర్యలు తీసుకోనుంది.నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: