కృష్ణా జిల్లా అనగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాని ఇప్పుడు ఆ కంచుకోటను జగన్ బద్దలు కొట్టారు. కమ్మ సామాజిక వర్గం అండ ఉన్నా సరే 16 సీట్లు ఉన్న జిల్లాలో కేవలం తెలుగుదేశం పార్టీని రెండు స్థానాలకు పరిమితం చేసారు జగన్... మాస్ లీడర్లు గా ఉన్న వాళ్ళు కూడా ఓటమిని ఎదుర్కొన్నారు. గద్దె రామ్మోహన్ ఒకరే సత్తా చాటగా... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నానా కష్టాలు నెగ్గుకొచ్చారు. మండలి బుద్దప్రసాద్ లాంటి ఉద్దండులు, సీనియర్ నేతగా పేరున్న దేవినేని ఉమా కూడా ఓటమి పాలు కావడం,


తెలుగు తమ్ముళ్ళకు మింగుడు పడలేదు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు అవుతుంది... మరి జిల్లా ప్రజల్లో జగన్ సర్కార్ పై ఉన్న అభిప్రాయం ఏంటి...? విద్యావంతులు ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో కృష్ణా జిల్లాలో వైసీపీ విషయంలో ఆసక్తికర విషయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి పాలనలేని ప్రభుత్వాన్ని మీకు అందిస్తాను అని జగన్ చెప్పడం, అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనం వృధా జరిగిందని జగన్ చేసిన వ్యాఖ్యలపై...


జిల్లా వాసుల్లో మంచి అభిప్రాయమే ఉంది... ఇది వర్షాకాలం కావడంతో ఇసుక వాడకం తక్కువగానే ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించినట్టు గా... ఇది సీజన్ కాదు. ఇసుక విషయంలో జిల్లాలో పెద్దగా వ్యతిరేకత లేదు. చంద్రబాబుకి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికల ప్రచారం మినహా పెద్దగా ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ తొలిసారి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు అనుభవం కావాలి అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది.


ఆర్ధిక పరిస్థితి విషయంలో జగన్ కి అనుభవం లేకపోయినా ఆయన కొన్ని పథకాల విషయంలో దూకుడుగా వెళ్ళడం, కంటి వెలుగు, రైతు భరోసా పథకాల విషయంలో అనుసరించిన వైఖరి ప్రజల్లో సానుకూలతను తెచ్చింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం విషయంలో ఆటో వాలాల నుంచి సానుకూల స్పందనే వ్యక్తమవుతుంది. నవరత్నాల విషయంలో జగన్ వెనకడుగు వేసే అవకాశం కనపడటం లేదని, ఆయన అనుకున్నది సాధించే విధంగా పాలన కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారడం నియోజకవర్గానికే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: