సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఆఖరి అవకాశం  ఇచ్చారు. నవంబరు 5 లోపు కార్మికులంతా తమ తమ విధుల్లో  చేరవచ్చున్ని ప్రకటించారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.  ప్రస్తుతం 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని, నవంబరు 5 లోపు కార్మికలు విధుల్లో చేరకుంటే మిగిలిన ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెగించి చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కేసీఆర్. 


యూనియన్ల మాయలో పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని కార్మికుల కుటుంబాలకు సూచించారు. ఆర్టీసీ కార్మికులు కూడా తమ బిడ్డలేనన్న కేసీఆర్ వారి జీవితాలను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం కుదరదని, అలా చేస్తే ఎన్నో పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. మరో 90 కి పైగా కార్పొరేషన్ల నుంచి డిమాండ్లు వస్తాయని చెప్పారు సీఎం కేసీఆర్.


అంతే కాదు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారే అసలు హంతకులని సీఎం కేసీఆర్ అన్నారు. యూనియన్ల అడ్డగోలు డిమాండ్ల మూలంగా కార్మికులు బలి అవుతున్నారని, దయచేసి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.  ప్రస్తుతం 50 శాతం ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నామని, నవంబరు 5 లోపు కార్మికలు విధుల్లో చేరకుంటే వంద శాతం ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెగేసి చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కేసీఆర్. యూనియన్ల మాయలోపడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని కార్మికుల కుటుంబాలకు సూచించారు.


నవంబర్‌ 5వ తేదీ అర్ధరాత్రి లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా 5000  రూట్లను కూడా ప్రైవేట్‌కే అప్పగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు ప్రైవేట్ ఆపరేటర్లు కూడా సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. అయితే ఆ ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటారన్నారు. పర్మిట్లు ఇచ్చే విధానంలో కూడా మార్పుండదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందని దీన్ని చేజార్చుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
 

అయితే లాభాలొచ్చే రూట్లలో ఆర్టీసి మాత్రమే బస్సులను నడుపుతుందని - నష్టాలు వచ్చే రూట్లను మాత్రమే ప్రయివేట్ బస్సులకు కేటాయిస్తామని అన్నారు సీఎం కేసీఆర్.  ఆర్టీసీలో పోటీతత్వం ఉండాలనే ప్రైవేట్ వాళ్లకు ఇస్తున్నామని చెప్పారు. తాను చెబుతున్న విషయాలు మోటార్‌ వెహికల్‌ చట్టం లోనే చెప్పారంటూ ఇది తాము కొత్తగా చేస్తున్నదేమీ కాదన్నారు. పాలసీల విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని, అన్యాపదేశంగా హైకోర్టును ఉద్దేశించి కావచ్చు కేసీఆర్  అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: