మొన్న సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. వాయిదాలకు తప్పకుండా హాజరుకావాల్సిందే అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో టీడీపీ అనుకూల మీడియా పండగ చేసుకుంది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇది పెద్ద ఇబ్బందేమీ కాదంటున్నారు.


సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీఎం వైయస్ జగన్ వేసిన పిటీషన్ డిస్మిస్ అవ్వడాన్ని పరాజయంగానో, భారీ నష్టంగానో భావించాల్సిన పని లేదని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. సీబీఐ కోర్టు లో ఊరట లభించకపోయినా.. హైకోర్టులో తప్పకుండా మినహాయిం పు వస్తుందని నమ్ముతున్నారు. అందుకు వారు కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు.


హైకోర్టు తనకున్న విచక్షణాధికారంతోనే 482 సెక్షన్ కింద సీబీఐ కోర్టుకు, ఇతర కింది స్థాయి కోర్టులకు సైతం ఆదేశాలిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా 2016 లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయలో జరిగిన క్రిమినల్ డిఫమేషన్ కేసు మనం ఇక్కడ ఉదాహరణగా చెబుతున్నారు. రాజకీయ కక్షల్లో భాగంగా మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ కేజ్రీవాల్ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసినప్పుడు...ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ తనకు ఈ కేసులో వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరారు.


ఈ కేసును విచారించిన జస్టిస్ ముక్తా గుప్తా ఆధ్వర్యంలోని ఢిల్లీ హైకోర్టు కేసు విచారణ పూర్తి అయ్యేవారకూ సీఎం కేజ్రీవాల్ కు వ్యక్తిగత హాజరు నుంచి ఎగ్జమ్షన్ ఇచ్చింది. ఇది పర్మినెంట్ ఎగ్జమన్షన్. అయితే అవసరం అనుకున్నప్పుడు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి వాయిదాకు పిలుచుకోవచ్చని, ప్రతి వాయిదాకూ హాజరవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి క్రిమినల్ డిఫమేషన్ కేసును పరిగణలోకి తీసుకున్నప్పుడు హైకోర్టు విచక్షణాధికారాల వల్ల వైయస్ జగన్ కేసులోనూ ఊరట లభిస్తుందని వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: