ఇసుక కొరత సమస్యకు నిరసనగా.. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. బడుగులు, బలహీనుల పక్షాన ఎవరు పోరాడినా మద్దతు ఇవ్వాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ ఈ బడుగుల ప్రేమ కొన్ని సార్లు మాత్రమే కనిపిస్తే.. కొందరి విషయంలోనే కనిపిస్తే అనుమానించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.


ప్రస్తుతం ఇసుక కార్మికుల గురించిపోరాడుతున్న పవన్ కల్యాణ్.. గతంలో ఏం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి గనులు తవ్వినట్లుగా చంద్రబాబు హయాంలో ఇసుకను నదుల్లో తవ్వారు. ఇసుక దోపిడీని అరికట్టేందుకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే చంద్రబాబు కేబినెట్‌లో క్లీన్‌చిట్‌ ఇచ్చాడు. ఆ రోజు పవన్‌కు దీక్ష చేయాలని అనిపించలేదా..?


2017లో అప్పటి విశాఖపట్నం భవన నిర్మాణ సంస్థకు చెందిన అసోసియేషన్‌ అధ్యక్షుడు.. విపరీతమైన ఇసుక మాఫియా జరుగుతుంది. దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పాడు. అప్పడూ పవన్‌ పట్టించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఇసుక మాఫియాపై వార్త రాస్తే ఆ విలేకరిపై దాడి చేసి వేధింపులకు గురిచేశారు. అప్పుడూ పవన్‌ మాట్లాడలేదు.


ఫిబ్రవరిలో భవన నిర్మాణ కార్మికులంతా కలిసి చలో కలెక్టర్‌ అని కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్మికులకు రావాల్సిన రూ.900 కోట్లు చంద్రబాబు దారి మళ్లించాడని ధర్నా చేస్తే సంఘీభావం తెలపడానికి పవన్‌కు నోరు రాలేదు. భవన నిర్మాణ కార్మికుల నిధులను పక్కదారి పట్టించి చంద్రన్న బీమా అని మలుచుకుంటే నోరు విప్పలేదు.


ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికివదిలేశారని రాజ్యసభలో కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ ప్రకటన చేశారు. అప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పవన్‌ మాట్లాడలేదు. రూ.1543 కోట్ల భవన నిర్మాణ కార్మికుల డబ్బును కేవలం రూ. 400 కోట్లు ఇచ్చి మిగతాది చంద్రబాబు దారి మళ్లించాడు.. అది పవన్‌కు తప్పు అనిపించలేదా..? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: