పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం మీద అదో రకమైన వ్యతిరేకత ఉందని అంతా భావిస్తారు. 2008లో ప్రజారాజ్యంలో యువరాజ్యం  అధినేతగా జనాల్లోకి తొలిసారి వచ్చిన పవన్ పంచెలూడగొడతానంటూ ఏకంగా వైఎస్సార్ నే టార్గెట్ చేశారు. అది లగాయితూ ఆయన వైఎస్ ఫ్యామిలీ మీదనే గురి పెట్టి తన  రాజకీయాన్ని పదును పెట్టారని చెప్పాలి. అవినీతి, సామాజిక న్యాయం, మంచి రాజకీయం ఇలా పవన్ ఎన్ని చిలక పలుకులు వల్లించినా అవన్నీ పక్కన పెట్టి అసలు విషయం వేరేగా ఉందనే తన  రాజకీయం మొత్తం చెప్పిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు.


పవన్ అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్నే ఎదిరిస్తే చంద్రబాబు తో ఎప్పటికీ దోస్తీ చేయకూడదనే అంటారు. ఇక వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేసే పవన్ చంద్రబాబు తరువాత లోకేష్ కి టీడీపీలో పెద్ద పీట వేయడాన్ని మరచిపోయారా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మరో వైపు పవన్ సామాజిక న్యాయం అంటారు, టీడీపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా పవన్ కి తెలియనిది కాదు అంటారు. 


నేరస్తులు, దోపిడీకారులు  అని పవన్ అంటూ  ఉంటారు. చంద్రబాబుకు  పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చరిత్ర ఉందని కూడా పవన్ తెలిసినా చాలా తెలివిగా ఏమీ ఎరగనట్లుగా ఉంటారు. ఇక తొమ్మిదేళ్ల బాబు ఉమ్మడి ఏపీ పాలన చూసినా అయిదేళ్ళ నవ్యాంధ్ర పాలన చూసినా కూడా  అవినీతి బాగా విచ్చలవిడిగా సాగిపోయింది. పవనే ఒక సందర్భంలో ఏపీలో టీడీపీ వారు  దోచుకుని తింటున్నారు అంటూ విమర్శలు చేశారు.


ఇన్ని రకాలుగా బాబు విషయంలో విమర్శలు ఉన్నా సరే పవన్ ఆయన పక్కనే చేరి రాజకీయ ఆట ఆడడానికి కారణం వైఎస్సార్ ఫ్యామిలీ పట్ల సహజంగానే పవన్ కి  ఉన్న వ్యతిరేక భావమే కారణం అంటారు. నిజానికి పవన్ ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా అర్ధం కాదని అనే వాళ్ళూ ఉన్నారు. కానీ వైఎస్ కుటుంబం రాజకీయంగా ఉండకూడదు, ఎదగకూడదు అన్న ఏకైక అజెండాతో పవన్ చేస్తున్న రాజకీయాల మూలంగానే ఆయన టీడీపీకి సపోర్ట్ గా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు. 


నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడిగా పోటీ చేసినా రెండు పార్టీలు కలిసే  ఉన్నాయని కూడా అంటున్నారు. ఇపుడు ఆ మాస్క్ తొలగించేందుకే లాంగ్ మార్చ్ ముందుకు వచ్చిందని కూడా అంటున్నారు. మరి పవన్ రాజకీయం చంద్రబాబు దర్శకత్వం అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారంటే అందులో తప్పేముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: