ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొంతకాలంగా ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోన్న  విషయం తెలిసిందే. ఇసుక కొరత సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు రాష్ట్రంలో ఇసుక కొరతతో ఎవరు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి కరువై రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా కనీస ఉపాధి కరువై భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య తో కనీసం తమ తమ కుటుంబాలకు కూడా పోషించలేక మనస్తాపం చెంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక కొరత సమస్య ప్రభుత్వం తీరు వల్ల ఏర్పడిందని  ప్రతిపక్షాలన్నీ అధికార వైసీపీ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

 

 

 

 అంతేకాకుండా రాష్ట్రంలో అధికార వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని అందుకే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఇసుక కొరత సమస్యను పరిష్కారానికి పోరాటంలో భాగంగా లాంగ్ మార్చ్ కి  పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. కాగా దీనికి వివిధ పార్టీల మద్దతు కూడా కోరారు. అయితే అయితే  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేససి ... జనసేన మెజారిటీ సీట్లు సాధించి. ఆంధ్రప్రదేశ్  లో  రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అందరు భావించగా...  మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన ని సైతం ఓటమిపాలై  జనసేన పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. దీంతో ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గుడ్ బై  చెప్పేస్తారు  అనుకున్నారంతా. కానీ రాజకీయాల్లో ప్రజా సమస్యల తరఫున పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తూనే కున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నిరసన తెలపాలని భావించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ లోని సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్ కీ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. నేడు నిర్వహించే ఈ లాంగ్ మార్చ్ కోసం అన్ని పార్టీల మద్దతు కోరారు. కానీ ఒక్క టిడిపి మాత్రమే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చినట్లు సమాచారం. కాగా పవన్ లాంగ్ మార్చ్ గురుంచి  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో  ఎంతో ప్రభావితం చేస్తాడు అనుకున్న పవన్ ఘోర  ఓటమిపాలయ్యారు... మరి ఈ లాంగ్  మార్చ్ తో  ఇసుక కొరత పై పోరాటం చేస్తున్న పవన్  ఇక్కడ అయినా విజయం సాధిస్తారా...ఇసుక సమస్య పరిష్కారం అయ్యేలా ప్రభావితం చేస్తారా.?  అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: