ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా  ఇసుక కొరత సమస్య  పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత సమస్య తో రాష్ట్రం మొత్తం అల్లాడి పోతుంది. భవన నిర్మాణ కార్మికుల బతుకులు  అధ్వానంగా తయారయ్యాయి. గత ఐదు నెలల నుండి ఇసుక కొరత సమస్య ఏర్పడడంతో కనీసం ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడుతున్నాయి. ఐదు నెలల నుంచి రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యతో...  తగిన ఉపాధి లేక... ఏం చేయాలో అర్థం కాక కుటుంబ పోషణ చేయలేక... మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను  తీర్చాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి  ప్రతిపక్షాలు. 

 

 

 

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నిరసనగా  టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టారు. నేడు విశాఖ సెంట్రల్ పార్క్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. కాగా పవన్ లాంగ్ మార్చ్  కోసం అన్ని  పార్టీల మద్దతును కూడా కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తలపెట్టిన లాంగ్ మార్చ్  నేపథ్యంలో అధికార వైసీపీ మాత్రం పలు విమర్శలు గుప్పిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కేవలం రాజకీయ ఉనికి కోసమేనని... ఇసుక కొరత సమస్య పరిష్కార కోసమేనని ఆరోపిస్తున్నాయి.  తమ రాజకీయ లబ్ధి కోసం ఇసుక కొరత సమస్యను  వాడుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వం విమర్శలకు దిగుతుంది . అంతేకాకుండా రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ కావడం వల్ల వరదలు కారణంగానే ఇసుక కొరత సమస్య ఏర్పడిందని ప్రతిపక్షాలకు ఎందుకు అర్థం కావడం లేదు అంటూ విమర్శలు చేస్తోంది. విశాఖ సెంట్రల్ పార్క్ లో పవన్ కళ్యాణ్ చేపడుతున్న లాంగ్ మార్చ్ ఆంధ్రప్రదేశ్ లోని బారేజి లపై చేపడితే ఇసుక కొరతకు  అసలు కారణం ఏమిటో అర్థం అవుతుందని అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

 

 అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పుడూ విడిపోలేదని వీరిద్దరి లాంగ్ జర్నీ నేడు లాంగ్ మార్చ్  వరకు కలిసి ఉందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా లాంగ్ మార్చ్ ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ కు వచ్చింది కాదని టిడిపి అధినేత మాస్టర్ మైండ్  చంద్రబాబు గారి ఆలోచనే ఈ లాంగ్ మార్చ్ అని  వైసీపీ నేతలు అంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎజెండానే  పవన్ కళ్యాణ్ ఫాలో అవుతారు తప్ప పవన్ కళ్యాణ్ కు  ఎలాంటి ఎజెండా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు అయిన  పవన్ బాబు చెప్పిందే పాటిస్తున్నారని  ఆరోపిస్తున్నారు వైసిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: