వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కొరకు ఫింగర్ ప్రింట్ లాకింగ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ సంస్థ సెక్యూరిటీ కొరకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వాట్సాప్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఫీచర్ వినియోగించుకోవాలంటే యూజర్లు వాడే మొబైల్ లో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉండాలి. 
 
వాట్సాప్  ఫింగర్ ప్రింట్ లాకింగ్ ఫీచర్ వినియోగించాలంటే వాట్సాప్ యాప్ ను లేటెస్ట్ వెర్షన్ 2.19.308 కు అప్ డేట్ చేసుకోవాలి. వాట్సాప్ యాప్ అప్ డేట్ చేసిన తరువాత వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్స్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అకౌంట్స్ లో ప్రైవసీ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రైవసీలో కిందికి స్క్రోల్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ ఓపెన్ చేసి అన్ లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. 
 
ఆ తరువాత వాట్సాప్ స్క్రీన్ లాక్ ఎంత సమయానికి పడాలో సెట్ చేసుకోవాలి. వాట్సాప్ మెసేజ్  నోటిఫికేషన్లను కూడా కావాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు. వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ వలన ఈ ఫీచర్ వినియోగించే వారి వాట్సాప్ సందేశాలను ఇతరులు చూడలేరు. త్వరలో వాట్సాప్ వినియోగదారుల కొరకు మరిన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొనిరాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
పేమెంట్, మల్టీ ప్లాట్ ఫాం, డార్క్ మోడ్ మొదలైన ఫీచర్లు భవిష్యత్తులో వాట్సాప్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్లు అందుబాటులోకి రావటానికి మరికొన్నిరోజులు వాట్సాప్ యూజర్లు ఎదురు చూడక తప్పదు. ఫింగర్ ప్రింట్ లాకింగ్ ఫీచర్ తీసుకొనిరావటం పట్ల వాట్సాప్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: