పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈ పేరుకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఉండి క్రేజే వేరు. మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ కి   ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత జనసేవ చేయడానికి జనంలోకి బయలుదేరారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించి మొదటి నుంచి జనం తరపున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయక పోయినప్పటికీ... టీడీపీ కి మద్దతుగా నిలిచింది జనసేన పార్టీ. తాజాగా ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఒంటరిగానే పోటీ చేసింది. ఈ క్రమంలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అధికారం ఏర్పాటు చేయక పోయినా కనీస మెజారిటీ సీట్లు సాధించి కనీసం ప్రతిపక్ష హోదా అయినా  సాధిస్తారు అని అనుకున్నారు. 

 

 

 

 కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం జనసేనని కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుని  ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అన్న చిరంజీవి లాగే  పవన్ కళ్యాణ్ కూడా... జనసేన పార్టీ వేరే పార్టీలో  విలీనం చేసి  రాజకీయాలకు గుడ్ బై  చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి వెళ్ళిపోతారు  అని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం కూడా భారీ ఎత్తున జరిగింది. వీటిపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను మళ్లీ సినిమాల్లోకి వెళ్లను అంటూ  క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ  జనం  తరఫున పోరాటం చేస్తూనే ఉంటాను అని...జనసేవకే తన జీవితం అంకితం అని  తేల్చి చెప్పాడు.అన్నట్టుగానే  రాష్ట్రంలో ఏర్పడిన అన్ని సమస్యలపై ప్రజల తరఫున పోరాటం చేస్తూనే వున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనం తరఫున పోరాటానికి కావాల్సింది పదవి  కాదు... పట్టుదల అంకితభావం  అని నిరూపిస్తున్నారు జనసేనాని. 

 

 

 

 ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇసుక కొరత సమస్య  పట్టిపీడిస్తున్న తరుణంలో... భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి భవన నిర్మాణ కార్మికులకు ఏర్పడింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అధికార వైసిపి వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య ఏర్పడిందని పవన్  ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్  నిర్వహించేందుకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీని కోసం అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడా కోరారు. రాష్ట్రంలో ఇసుక కొరత పట్టి పీడిస్తున్న తరుణంలో...ఇసుక కొరత  సమస్య పరిష్కారం కోసం జనసేనాని చేపట్టిన లాంగ్ మార్చ్ తో  మరోసారి పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. పదవి  ఉంటేనే ప్రజల దగ్గరికి వచ్చే ఈ తరుణంలో...  చేస్తామని అనుకుంటున్న ఈ తరుణంలో. ఎలాంటి పదవి లేకున్నా ఓ వైపు పార్టీని కీలక నేతలు విడిపోతున్న కూడా ప్రజల తరఫున పట్టు విడవక పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజా నాయకుడే.

మరింత సమాచారం తెలుసుకోండి: